పారిస్ ఒలింపిక్స్ 2024 అథ్లెట్లకు సర్‌ప్రైజ్ ఇచ్చిన శాంసంగ్.. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా..!
పారిస్ ఒలింపిక్స్ 2024 భారత కాలమానం ప్రకారం జులై 26 రాత్రి 11 గంటలకు ప్రారంభ వేడుకలు నిర్వహించారు. ఈ విశ్వ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లు పోడియం వద్దకు స్మార్ట్‌ఫోన్‌లు సహా ఇతర వ్యక్తిగత వస్తువులను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అయితే క్రీడాకారులకు టెక్ దిగ్గజం శాంసంగ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. కేవలం అథ్లెట్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్పెషల్ ఎడిషన్ హ్యాండ్‌సెట్‌లను Samsung Galaxy Z Flip 6 Olympic Edition) వారికి అందించింది.
ఈ శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను అథ్లెట్లు తమ వెంట పోడియం వద్దకు తీసుకెళ్లేందుకు, ఉపయోగించేందుకు అనుమతి పొందారు. ఈ ఒలింపిక్స్ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంది. గోల్డ్ రంగులో ఒలింపిక్స్ రింగ్‌లు మరియు పారాలింపిక్ అజిటోస్‌తో పసుపు రంగులో ఈ హ్యాండ్‌సెట్‌ను తీసుకొచ్చింది.

ఈ ఒలింపిక్స్ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ కేస్ కోసం శాంసంగ్ సంస్థ పరీసియన్ మెన్స్ లగ్జరీ మైసన్, బెర్లుటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కేస్ వెనీజియో లెదర్‌తో తయారు చేశారు. ఒలింపిక్స్ రింగ్స్ సహా ఇతర రంగులతో ఈ శాంసంగ్ Z ఫ్లిప్ 6 ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
శాంసంగ్ ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లను పారిస్ ఒలింపిక్స్ 2024 పోటీల్లో పాల్గొంటున్న ప్రతి అథ్లెట్‌కు అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 100GB డేటా సహా అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. ఫలితంగా తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు అందుబాటులోకి ఉండేందుకు వీలుంటుందని భావిస్తోంది.
ఈ శాంసంగ్ Z ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్ ఒలింపిక్స్ ఎడిషన్ కేవలం పారిస్ ఒలింపిక్స్ 2024 అథ్లెట్స్ కు మాత్రమే అందిస్తోంది. ఇతరులకు గానీ లేదా సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా అథ్లెట్లు.. తమ ఇతర భాషల అభిమానులకు నేరుగా కనెక్ట్ అయ్యే విధంగా లైవ్ ట్రాన్సిలేషన్ (ఇతర భాషల్లోకి అప్పటికప్పుడే అనువాదం చేసే సామర్థ్యం) సదుపాయాన్ని కలిగి ఉన్నారు. తమ కాల్స్, మెసేజ్‌లను సులభంగా ఇతర భాషల్లోకి అనువాదం చేసే వీలుంది.
దీంతోపాటు ఇతర భాషల అథ్లెట్లతో మాట్లాడేందుకు వీలుగా తమ సంభాషణలను వారి భాషల్లోకి అనువాదం చేసే సామర్థ్యం కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ల సొంతమని సంస్థ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌ల ద్వారా ఇది సాధ్యమైందని తెలిపింది. ఈ ఫీచర్ అనేక మంది క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








