భారీ ఆఫర్లకు తెరలేపిన పేటీఎం

|

ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం పేటీఎం మరోసారి భారీ ఆఫర్లకు తెరలేపింది. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు 5 రోజుల పాటు క్యాష్‌బ్యాక్ డేస్ పేరుతో ఈ ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా వినియోగదారులు మొబైల్స్, ల్యాప్ టాప్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ యాక్ససరీస్ లాంటి వాటిపై ఈ ఆఫర్లను అందించనుంది. కొనుగోలుదారులు దాదాపు రూ. 5 వేల వరకు స్మార్ట్ ఫోన్ల కొనుగోలు మీద క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ల్యాపీలు, గృహోపకరణాల మీద రూ.20 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వీటితో పాటు అనేక రకాలైన ప్రయోజనాలను ఈ కామర్స్ దిగ్గజం అందిస్తోంది.

వోడాఫోన్‌ దూకుడు : రూ.597 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ లాంచ్వోడాఫోన్‌ దూకుడు : రూ.597 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ లాంచ్

HDfC ఆఫర్స్
 

HDfC ఆఫర్స్

కష్టమర్లు ఈ సేల్ లో భాగంగా HDfC డెబిట్, క్రెడిట్ కార్డు ఉన్న కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్ పొందుతారు. అయితే ఈ ఆఫర్ రెగ్యులర్ ఈఎమ్ఐ కొనుగోలు దారులకు మాత్రమే. కొనుగోలు దారులు శాంసంగ్ గెలాక్సీ నోట్ 9, ఐఫోన్ ఎక్స్ వంటి ఫోన్ల మీద ఈ ఆఫర్లను క్యాష్‌బ్యాక్ డే సేల్ లో భాగంగా అందిస్తోంది.

ఐఫోన్ ఎక్స్

ఐఫోన్ ఎక్స్

ఈ సేల్ లో భాగంగా ఐఫోన్ ఎక్స్ 64జిబి స్టోరేజ్ వేరియంట్ పై కంపెనీ రూ.4082 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ.81,460గా ఉంది. తగ్గింపు ధర తర్వాత కొనుగోలుదారులు ఈ ఫోన్ ని రూ.77,554కి సొంతం చేసుకోవచ్చు.

గూగుల్ పిక్సల్ 2ఎక్స్ఎల్

గూగుల్ పిక్సల్ 2ఎక్స్ఎల్

దిగ్గజ టెక్నాలజీ సంస్థ గూగుల్ తన ఫ్లాగ్ షిఫ్ ఫోన్ గూగుల్ పిక్సల్ 2ఎక్స్ఎల్ మీద రూ.2 వేల క్యాష్ బ్యాక్ ని ప్రకటించింది. ఇప్పుడు దీన్ని యూజర్లు 37,999కే సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9
 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9

ఈ ఫోన్ మీద దాదాపు రూ. 9 వేల క్యాష్ బ్యాక్ ని అందిస్తోంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ రూ.75,900 ధరకి కొనుగోలుదారులు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఒప్పో ఎఫ్9 ప్రొ కూడా రూ.22,790 కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.1200 క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

సీఓఓ స్పందన

సీఓఓ స్పందన

ఈ సంధర్భంగా కంపెనీ సీఓఓ కిరణ్ వసిరెడ్డి మాట్లాడుతూ పేటీఎం దేశంలోనే అత్యంత నాణ్యత, విశ్వసనీయత కలిగిన ఫ్లాట్ ఫాం అని ఈ ఫ్లాట్ ఫాం మీద దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని ఈ సంవత్సరానికి బెస్ట్ డీల్స్ , ఆఫర్స్ అందిస్తున్నామని తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Paytm Cashback Days announced from December 12 - 16; offers on Samsung Galaxy Note 9, iPhone X and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X