Home
Mobile

అనుకోని సమయంలో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించిన పేటీఎం

ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆఫర్ల సేల్ ప్రకటించడం యూజర్లు ఆసక్తి చూపడంతో ఇప్పుడు పేటీఎం కూడా అదే బాటలో నడుస్తోంది.

By Hazarath Aiah

ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆఫర్ల సేల్ ప్రకటించడం యూజర్లు ఆసక్తి చూపడంతో ఇప్పుడు పేటీఎం కూడా అదే బాటలో నడుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లు మిస్ అయినవారు ఇప్పుడు పేటీఎంలో కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు డిజిటల్‌ పేమెంట్‌ దిగ్గజం పేటీఎం మాల్‌, ఒప్పో, మోటరోలా, హనర్‌ వంటి స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఫ్లాట్‌ 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. అనుకోని సమయంలో పేటీఎం ఆఫర్ ప్రకటించిన ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

ఒప్పో ఎఫ్‌ 5 యూత్‌

ఒప్పో ఎఫ్‌ 5 యూత్‌

ఈ ఏడాది విడుదలైన ‘ఒప్పో ఎఫ్‌ 5 యూత్‌' స్మార్ట్‌ఫోన్‌పై పేటీఎం 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఇదే కాక కంపెనీ అదనంగా మరో 5,499 రూపాయల డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంటే మొత్తంగా కలుపుకుని చివరకు ‘ఒప్పో ఎఫ్‌ యూత్‌' 14,500 రూపాయలకే వస్తుంది. క్యాష్‌బ్యాక్‌ పొందాలనుకుంటే పేమెంట్‌ చేసేటప్పుడు వినియోగదారుడు ‘ఎమ్‌ఓబీ15' అనే ప్రోమో కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని పేటీఎం తెలిపింది. క్యాష్‌బ్యాక్‌ మొత్తం 24 గంటల్లో పేటీఎం వాలెట్‌కు యాడ్‌ అవుతుందని తెలిపారు.

ఒప్పో ఎఫ్5 యూత్ ఫీచర్లు

ఒప్పో ఎఫ్5 యూత్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఒప్పో ఎఫ్‌7 డైమండ్‌ బ్లాక్‌ ఎడిషన్‌

ఒప్పో ఎఫ్‌7 డైమండ్‌ బ్లాక్‌ ఎడిషన్‌

ప్రస్తుత విలువ 27, 990 రూపాయలు. కంపెనీ 4 వేల రూపాయల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ప్రకటించిన తర్వాత ఈ ఫోన్‌ ఖరీదు 23,990 రూపాయలకు తగ్గింది. ఇదే కాక ప్రోమో కోడ్‌ ‘ఎమ్‌ఓబీ15'ను అప్లై చేస్తే అదనంగా మరో 15 శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని పేటీఎం తెలిపింది.

ఒప్పో ఎఫ్7 డైమండ్ బ్లాక్  ఫీచర్లు

ఒప్పో ఎఫ్7 డైమండ్ బ్లాక్ ఫీచర్లు

ఒప్పో ఎఫ్7 డైమండ్ బ్లాక్ క్రికెట్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.23 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

మోటో జీ6

మోటో జీ6

మోటో జీ6 స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు 19,999 రూపాయలు. కానీ ఇప్పటికే కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్‌తో ఇది 16,998 రూపాయలకు లభిస్తుంది.పేటీఎం అదనంగా మరో 15 శాతం డిస్కౌంట్‌ ఇస్తుండటంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర మరో 2,210 రూపాయలు తగ్గుతుంది. పేటీఎం డిస్కౌంట్‌ అప్లై అవ్వాలంటే పేమెంట్‌ చేసే సమయంలో ప్రోమో కోడ్‌ ‘ఎమ్‌ఓబీ15'ను నమోదు చేయలని కంపెనీ చెప్పింది.

మోటో జీ6 ఫీచర్లు

మోటో జీ6 ఫీచర్లు

5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, డాల్బీ ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

మోటో జీ6 ప్లే

మోటో జీ6 ప్లే

మోటో జీ 6 తో పాటు జీ 6 ప్లేపై కూడా పేటీఎం 15 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ ప్రకటించిన 1,744 రూపాయల డిస్కౌంట్‌ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ 12,255 రూపాయలకు వస్తుంది. ఇదే కాక పేటీఎం ప్రకటించిన 15 శాతం క్యాష్‌బ్యాక్‌తో అదనంగా మరో 1,593 రూపాయలు తగ్గుతుంది. 15 శాతం క్యాష్‌బ్యాక్‌ అప్లై అవ్వాలంటే పేమెంట్‌ చేసే సమయంలో ప్రోమో కోడ్‌ ‘ఎమ్‌ఓబీ15'ను ఎంటర్‌ చేయాలి.

మోటో జీ6 ప్లే ఫీచర్లు

మోటో జీ6 ప్లే ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

హానర్‌ 9 లైట్‌

హానర్‌ 9 లైట్‌

హనర్‌ కంపెనీ నుంచి ఈ ఏడాది వచ్చిన తొలి స్మార్ట్‌ ఫోన్‌ హనర్‌ 9 లైట్‌. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ ప్రకటించిన 2,000 రూపాయల డిస్కౌంట్‌తో పాటు అదనంగా పేటీఎం ప్రకటించిన 15 శాతం డిస్కౌంట్‌ను కలుపుకుని ఈ ఫోన్‌ ఫైనల్‌ ప్రైస్‌ 14,998 రూపాయలకు లభిస్తుంది.

హానర్ 9 లైట్ ఫీచర్లు

హానర్ 9 లైట్ ఫీచర్లు

5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్‌ 7 ఎక్స్‌

హానర్‌ 7 ఎక్స్‌

బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ హనర్‌ 7 ఎక్స్‌ పై పేటీఎం మాల్‌ ప్రకటించిన 15 శాతం క్యాష్‌బ్యాక్‌ వల్ల 2,516 రూపాయలు తగ్గి చివరకూ 16, 770 రూపాయలకు అందుబాటులో ఉందని పేటీఎం ప్రకటించింది.

హానర్ 7ఎక్స్ ఫీచర్లు

హానర్ 7ఎక్స్ ఫీచర్లు

5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డి స్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Paytm is offering flat 15% cashback on smartphones from these brands More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X