ఐఫోన్ 7ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండి
పేటీఎం మరోసారి దివాళి సేల్ తో దూసుకువస్తోంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్ నవంబర్ 7 వరకు కొనసాగనుంది.
పేటీఎం మరోసారి దివాళి సేల్ తో దూసుకువస్తోంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్ నవంబర్ 7 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో భాగంగా కంపెనీ Paytm Mall Maha Cashback Sale పేరుతో భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. కంపెనీ దాదాపు రూ. 501 కోట్ల వరకు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సేల్ లో ముఖ్యంగా దిగ్గజ కంపెనీ ఆపిల్ ఐఫోన్ 7 ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫోన్ కొత్తగా రిలీజైన వన్ ప్లస్ ధర కన్నా తక్కువకే లభించనుంది.

ఐఫోన్ 7పై రూ.6వేల వరకు క్యాష్ బ్యాక్....
ఐఫోన్ 7పై రూ.6వేల వరకు క్యాష్ బ్యాక్ ను పేటీఎమ్ ప్రకటించింది. కాగా దీని అసలు ధర రూ.38,499గా ఉంది. ఇప్పుడు పేటీఎమ్ డిస్కౌంట్ సేల్ ఆఫర్ కింద దీన్ని కొనుగోలు దారులు రూ.33,489కే సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ 6టీ ధర కన్నా...
ఈ వారంలో రిలీజైన మోస్ట్ హై ఫీచర్ ఎండ్ ఫోన్ వన్‌ప్లస్ 6టీ ధర కన్నా ఇది చాలా తక్కువ. వన్‌ప్లస్ 6టీ ధర మార్కెట్లో ఇప్పుడు రూ.37,999గా ఉంది. దీన్ని కన్నా తక్కువకే ఐఫోన్ 7 అందుబాటులోకి వచ్చింది.

ఫోన్లపై exchange discountsలను కూడా అందిస్తోంది...
దీంతో పాటు కంపెనీ పలు రకాల ఫోన్లపై exchange discountsలను కూడా అందిస్తోంది. ఉదాహరణకు OnePlus 5 and 5Tలను ఎక్స్జేంచ్ చేసుకుంటే రూ.72 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. Vivo V9పై రూ. 5,700 వరకు పొందవచ్చు.

యాక్సిస్ క్రెడిట్ ,డెబిట్ కార్డులు ఉపయోగించి....
అలాగే యాక్సిస్ క్రెడిట్ ,డెబిట్ కార్డులు ఉపయోగించి మొబైల్స్ కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్సన్ ఉపయోగించుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది.

ఈ వారం రోజలు...
ఈ వారం రోజలు ఈ ఈ కామర్స్ దిగ్గజం ప్రతి రెండు గంటలకు ఓ సారి ఫ్లాష్ సేల్ ను నిర్వహిస్తోంది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే గోల్డన్ అవర్స్ పేరుతో ఫోన్లపై భారీ తగ్గింపులను కూడా అందించేందుకు రెడీ అయింది. ఈ సేల్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దని కంపెనీ కోరుతోంది.


Click it and Unblock the Notifications








