Home
Mobile

పేటీఎం సైలెంట్‌గా వదిలిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్లను గమనించారా ?

మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. మంచి ఫీచర్లతో లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన ఏదైనా మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..

By Hazarath Aiah

మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. మంచి ఫీచర్లతో లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన ఏదైనా మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే మీకు పేటీఎం ఆహ్వానం పలుకుతోంది. డిజిటల్‌ దిగ్గజం పేటీఎం తన మాల్‌లో స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. బ్రాండెడ్ కంపెనీలైన నోకియా, మోటోరోలా, ఒప్పో, వివో లాంటి కంపెనీ స్మార్ట్‌ఫోన్లపై ఈ ఆఫర్లను అందిస్తున్నట్లుగా పేటీఎం ప్రకటించింది. మరి కంపెనీ ప్రకటించిన ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే..

 నోకియా

నోకియా

నోకియా స్మార్ట్‌ఫోన్లపై పేటీఎం మాల్‌ తన ప్లాట్‌ఫామ్‌పై 21 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. 18 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.

Nokia 8

Nokia 8

దీని మీద కంపెనీ 21 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని రిలీజ్ ధర రూ.31500గా ఉంది. తగ్గింపులో భాగంగా రూ. 25,830కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు రూ. 5,670 క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

మోటోరోలా

మోటోరోలా

మోటోరోలా హ్యాండ్‌సెట్లపై కూడా 35 శాతం వరకు డిస్కౌంట్లను పేటీఎం మాల్‌ అందిస్తోంది. డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్‌ను కూడా ఇది ఆఫర్‌ చేస్తోంది. క్యాష్‌బ్యాక్‌ మొత్తం డివైజ్‌ను బట్టి ఉంది.

Moto G5S (32GB variant)

Moto G5S (32GB variant)

ఈ ఫోన్ మీద కంపెనీ 35 శాతం తగ్గింపును అందిస్తోంది. అలాగే రూ.1,758 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. దీని ధర ఇప్పుడు రూ.8,007గా ఉంది.Moto X4 మీద కూడా భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

ఒప్పో

ఒప్పో

5 శాతం ఫ్లాట్‌ క్యాష్‌బ్యాక్‌తో ఒప్పో స్మార్ట్‌ఫోన్లు, పేటీఎం మాల్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్‌పై గరిష్టంగా 25 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాక 1,199 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్‌ అనంతరం ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్‌ 10,791 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది.

వివో

వివో

ఒప్పో మాదిరిగా వివో హ్యాండ్‌సెట్లు కూడా ఫ్లాట్‌ 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను కలిగి ఉన్నాయి. అన్ని చైనీస్‌ హ్యాండ్‌సెట్లతో పోల్చుకుంటే, వివో వీ5ఎస్‌ స్మార్ట్‌ఫోనే గరిష్టంగా 31 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై 655 రూపాయల క్యాష్‌బ్యాక్‌ కూడా ఈ ఫోన్‌పై లభిస్తోంది. దీంతో మొత్తంగా రూ.12,444కు వివో వీ5ఎస్‌ను పేటీఎం మాల్‌ విక్రయిస్తోంది.

Top బ్రాండ్లపై

Top బ్రాండ్లపై

ఆపిల్‌, గూగుల్‌, శాంసంగ్‌, హానర్‌, లెనోవో స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై కూడా పేటీఎం మాల్‌ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది.

ఆపిల్‌ ఐఫోన్లపై

ఆపిల్‌ ఐఫోన్లపై

ఆపిల్‌ ఐఫోన్లపై 9 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌, శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌, గూగుల్‌ పిక్సెల్‌ డివైజ్‌లపై కనీసం 6 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది.

Best Mobiles in India

English summary
Paytm offers cashback on Motorola, Nokia, Oppo and other smartphones More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X