Home
Mobile

గెలాక్సీ నోట్ 9పై రూ.24 వేల డిస్కౌంట్, పేటీఎం కాంబో డీల్‌పై ఓ లుక్కేయండి

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ అదిరిపోయే ఫీచర్లతో, ఆకర్షణీయమైన రూపురేఖలతో తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 9ను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

By Hazarath Aiah

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ అదిరిపోయే ఫీచర్లతో, ఆకర్షణీయమైన రూపురేఖలతో తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 9ను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చేయగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. ఈ బిగ్‌-స్క్రీన్‌ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి పేటీఎం మాల్‌ కోంబో డీల్‌ను ప్రకటించింది. ఈ డీల్ మీద మొత్తం రూ. 24 వేల వరకు డిస్కౌంట్ ని అందిస్తోంది. పేటీఎం మాల్‌ కోంబో డీల్‌ పూర్తి వివరాల్లో కెళితే..

ఫ్లాట్‌ 6000 రూపాయల డిస్కౌంట్‌

ఫ్లాట్‌ 6000 రూపాయల డిస్కౌంట్‌

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9పై ఫ్లాట్‌ 6000 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేసింది. ఈ డిస్కౌంట్‌ పేటీఎం వాలెట్లలో క్యాష్‌బ్యాక్‌ రూపంలో కస్టమర్లు పొందనున్నారు. డివైజ్‌ కస్టమర్‌ వద్దకు చేరాక 12 రోజుల అనంతరం ఈ క్యాష్‌బ్యాక్‌ను క్రెడిట్‌ చేయనున్నట్టు పేటీఎం మాల్‌ తెలిపింది.

శాంసంగ్‌ గేర్‌ స్పోర్ట్‌ స్మార్ట్‌వాచ్‌

శాంసంగ్‌ గేర్‌ స్పోర్ట్‌ స్మార్ట్‌వాచ్‌

దాంతో పాటు పేటీఎం మాల్‌లో గెలాక్సీ నోట్‌ 9 బుక్‌ చేసుకున్న వారికి శాంసంగ్‌ గేర్‌ స్పోర్ట్‌ స్మార్ట్‌వాచ్‌పై రూ.18,000 డిస్కౌంట్‌ లభించనుంది. కోంబో ఆఫర్‌లో భాగంగా శాంసంగ్‌ గేర్‌ స్పోర్ట్‌ను కేవలం రూ.4,999కే అందిస్తుంది.

రెండు కలుపుకుంటే..

రెండు కలుపుకుంటే..

ఇవి రెండు కలుపుకుంటే దాని ధర రూ.24 వేల తగ్గినట్లేనని పేటీఎమ్ తెలిపింది. అదేవిధంగా తొమ్మిది నెలల పాటు నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది?

భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది?

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది? దాని ధరెంత ఉంటుంది? అనే విషయాలపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. అమెరికా మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

ధర

ధర

గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,700)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1250 డాలర్లు (దాదాపుగా రూ.85,900)గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

రూ.7900 చెల్లిస్తే శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 మీ సొంతమవుతుంది !

రూ.7900 చెల్లిస్తే శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 మీ సొంతమవుతుంది !

రూ.7900 చెల్లిస్తే శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 మీ సొంతమవుతుంది !

ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికోసం Airtel రూ. 7900 డౌన్ పేమెంట్‌తో గెలాక్సీ నోట్ 9ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

Best Mobiles in India

English summary
Paytm's combo deal on Samsung Galaxy Note 9 offers Rs 24,000 flat discount: Details here More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X