ఐఫోన్ లాక్ అయిందా, అన్‌లాక్ కోసం 48 సంవత్సరాలు ఆగాల్సిందే !

|

ఆపిల్ ఐఫోన్ లాక్ అయితే దాన్ని ఓపెన్ చేయడానికి 48 సంవత్సరాలు పడుతుందట..ఈ వార్తను నమ్మలేకున్నారా..ఇది చైనాలో ఒకరికి జరిగిన అనుభవం. చిన్న పొరపాటుతో లాక్ అయిన ఐఫోన్ తెరుచుకునేందుకు 48 ఏళ్లు పడుతుందని ఆపిల్ స్టోర్ సిబ్బంది చెప్పడంతో ఓ మహిళ అవాక్కైంది. వివరాల్లోకి వెళ్తే... చైనాలోని షాంఘైకి చెందిన లూ అనే మహిళ ఐఫోన్‌ వినియోగిస్తోంది. అల్లరి చేస్తున్న తన రెండేళ్ల కొడుకుకి ఆడుకునేందుకు తన ఐఫోన్ లాక్ చేసి ఇచ్చింది. తన పని ముగిసిన తరువాత పిల్లాడిని ఆడించేందుకు తీసుకుంటూ తన ఫోన్ చూసుకుంది.

 

రూ. 14 వేల స్మార్ట్‌టీవీలో దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఆ 2 రోజులే కొనుగోలురూ. 14 వేల స్మార్ట్‌టీవీలో దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఆ 2 రోజులే కొనుగోలు

48 ఏళ్ల తరువాత..

48 ఏళ్ల తరువాత..

అప్పటికి ఫోన్ స్క్రీన్ పై 25 మిలియన్‌ నిమిషాల (48 ఏళ్ల) తరువాత అన్‌లాక్ చేయాలంటూ సందేశం వచ్చింది. దీంతో బిత్తరపోయిన ఆమె పరుగున ఆపిల్ స్టోర్‌కు వెళ్లింది. అన్‌లాక్ చేసే ప్రయత్నం చేస్తే ఆ మెసేజీ చూపిస్తోందని, తన ఫోన్‌ను అన్ లాక్ చేయాలని స్టోర్ సిబ్బందిని కోరింది.

ఫోన్‌ను పరీక్షించిన సిబ్బంది

ఫోన్‌ను పరీక్షించిన సిబ్బంది

దీంతో ఫోన్‌ను పరీక్షించిన సిబ్బంది, ఫోన్‌ను రీబూట్ చేయాలని చెప్పారు. అలా చేస్తే ఫోన్ లో ఉన్న తన డేటా, కాంటాక్ట్స్, ఫైల్స్ మొత్తం పోతాయని, తన ఫోన్‌‌లో విలువైన సమాచారం ఉందని, అది పోకుండా అన్ లాక్ చేయాలని ఆమె కోరింది.

48 ఏళ్లు ఎదురు చూడండి..
 

48 ఏళ్లు ఎదురు చూడండి..

దీంతో 'అయితే 48 ఏళ్లు ఎదురు చూడండి, ఫోన్ తెరుచుకుంటుంది, అప్పుడు వినియోగించొచ్చు' అంటూ ఆపిల్ స్టోర్ సిబ్బంది సమాధానమివ్వడంతో ఆ మహిళ బిత్తరపోయింది.

ఫ్యాక్టరీ రీసెట్‌

ఫ్యాక్టరీ రీసెట్‌

ఫోన్‌ అన్‌‌లాక్‌ అవ్వాలంటే ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాల్సి ఉంటుందని, అలా చేయాలంటే ఫోన్‌ను రీ బూట్ చేయాల్సిందేనని, లేని పక్షంలో 48 ఏళ్లు వేచి చూడడమే మార్గమని వారు వివరించారు.

ఐఫోన్ యూజర్ల కోసం ‘Files’ యాప్, బోలెడన్ని ఉపయోగాలు

ఐఫోన్ యూజర్ల కోసం ‘Files’ యాప్, బోలెడన్ని ఉపయోగాలు

థర్డ్ పార్టీ యాప్‌లను కూడా యాడ్ చేసుకునే అవకాశం.. ఐఫోన్ యూజర్లను ఉద్దేశించి ఆపిల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఫైల్స్ యాప్‌లో బాక్స్, డ్రాప్‌బాక్స్, వన్‌డ్రైవ్ వంటి థర్డ్‌పార్టీ క్లౌడ్ యాప్‌లను యాడ్ చేసుకుని వాటిలోని ఫైల్స్‌ను యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. ఫైల్స్ యాప్‌లో థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్.. స్టెప్ 1 : ముందుగా మీకు అవసరమైన థర్డ్ పార్టీ క్లౌడ్ యాప్‌లను ఐఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. స్టెప్ 2 : తురువాతి స్టెప్‌లో భాగంగా ఫైల్స్ యాప్‌ను ఓపెన్ చేసి లొకేషన్స్‌లోని Edit సెక్షన్‌ను ఓపెన్ చేయండి. స్టెప్ 3 : ఎడిట్ సెక్షన్‌‌లోకి వెళ్లిన తరువాత థర్డ్ పార్టీ యాప్స్‌కు సంబంధించిన టాగిల్‌ను టర్న్ ఆన్ చేసుకుని Done బటన్ పై టాప్ చేసినట్లయితే థర్డ్ పార్టీ క్లౌడ్ యాప్స్‌‌ను ఫైల్స్ యాప్ విజయవంతంగా యాడ్ చేసుకోగలుగుతుంది.

ఫైల్స్‌ను సక్రమంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు

ఫైల్స్‌ను సక్రమంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు

ఫైల్స్‌ను సక్రమంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు.. ఫైల్స్ యాప్ ద్వారా ఐక్లౌడ్ డ్రైవ్‌లోని ఫైల్స్‌ను సక్రమంగా ఆర్గనైజ్ చేసుకునే వీలుంటుంది. ఒక డివైస్‌లో చేసిన ఎడిట్స్ ఆటోమెటిక్‌గా ఇతర డివైసెస్‌లో అప్‌డేట్ కాబడతాయి.ఫైల్స్ యాప్ సహాయంతో ఐక్లౌడ్ డ్రైవ్‌లో స్టోర్ అయిన ఫైల్స్‌ను నేరుగా అక్కడి నుంచే మిత్రులకు షేర్ చేసుకునే వీలుంటుంది. యాప్‌లో ముందుగా షేర్ చేయాలనుకుంటున్న ఫైల్‌ను సెలక్ట్ చేసుకుని Share icon పై టాప్ చేసినట్లయితే ఫైల్ విజయవంతంగా షేర్ కాబడుతుంది. ఎయిర్‌డ్రాప్, మెసేజెస్, మెయిల్, షేరుడ్ నోట్ వంటి ఆప్షన్స్ ద్వారా ఫైల్స్‌ను షేర్ చేసుకునే వీలుంటుంది.

అవసరం‌లేని ఫైల్స్‌ను డిలీట్ చేసుకునే అవకాశం..

అవసరం‌లేని ఫైల్స్‌ను డిలీట్ చేసుకునే అవకాశం..

ఐక్లౌడ్ డ్రైవ్‌లోని అన్‌వాంటెడ్ ఫైల్స్‌ను నేరుగా ఫైల్స్ యాప్ ద్వారానే డిలీట్ చేసుకునే వీలుంటుంది. ఫైల్‌ను సెలక్ట్ చేసుకుని delete icon పై క్లిక్ చేసినట్లయితే ఫైల్ ఆటోమెటిక్‌గా డిలీట్ కాబడుతుంది. డిలీట్ చేసిన ఫైల్స్ ఐక్లౌడ్ నుంచి రీసెంట్ డిలీటెడ్ ఫోల్డర్‌లోకి మూవ్ కాబడతాయి. ఒకవేళ మీరు ఆ ఫైల్‌ను తిరిగి పొందాలనుకుంటున్నట్లయితే, ఆ ఫోల్డర్‌లోకి వెళ్లి 30 రోజుల్లోపు రిట్రైవ్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Peppa Pig-loving toddler causes mom’s iPhone to be locked for 48 years More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X