ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకే ఆశ్చర్యపోతున్నారా.. త్వరలో AI ఫోన్ రాబోతోంది..!
AI Phone: డ్యూయిష్ టెలికామ్ (DT), పెర్‌ప్లెక్సిటీ అనే AI స్టార్టప్ సంస్థ కలిసి ఒక అదిరిపోయే AI ఫోన్‌ను తీసుకురాబోతున్నాయి. ఈ ఫోన్ 2025 చివరి నాటికి విడుదల కానుండగా, అమ్మకాలు మాత్రం 2026లో మొదలవుతాయి. ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉండనుంది. దీని ధర 1,000 (సుమారు రూ.87,000) లోపే. ఈ AI ఫోన్ రాకతో, మొబైల్స్‌ను వాడే విధానం పూర్తిగా మారిపోతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఇది సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. మొదటగా యూరప్‌లో విడుదల కానున్న ఈ ఫోన్, ఆ తర్వాత ఇతర దేశాల మార్కెట్లలోకి కూడా రానుంది. కొన్ని ఏఐ ఫీచర్లు ఉన్న మొబైల్స్‌కే యూజర్లు బాగా ఆకర్షితులవుతున్నారు. మరి దీనికోసం ఎంతలా ఎగబడతారో చూడాలి.

* యాప్స్‌కి ఇక సెలవా? వాయిస్ కమాండ్సే మెయిన్..!
సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కాకుండా, ఈ AI ఫోన్ ఒక పర్సనల్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. ఇందులో యాప్స్‌తో పెద్దగా పని ఉండదు. వాయిస్ కమాండ్స్‌తోనే అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. పెర్‌ప్లెక్సిటీ సంస్థ AI సెర్చ్ టెక్నాలజీకి పెట్టింది పేరు. వాళ్ల టెక్నాలజీనే ఈ ఫోన్‌లో డీఫాల్ట్ అసిస్టెంట్‌గా ఉంటుంది.
ఇది కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మాత్రమే కాదు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం, రెస్టారెంట్ రిజర్వేషన్లు చేయడం, ఈమెయిల్స్ పంపడం, రిమైండర్లు సెట్ చేయడం వంటి పనులన్నీ చూసుకుంటుంది. AI అంటే కేవలం సమాచారం ఇచ్చేది మాత్రమే కాదు, యాక్టివ్‌గా పనులు చేసే టెక్నాలజీగా మారుతుందని ఈ ఫోన్ నిరూపించనుంది.
* యూజర్ ఎక్స్‌పీరియన్స్ పెంచుతున్నాం..
డ్యూయిష్ టెలికామ్ బోర్డ్ మెంబర్ క్లాడియా నెమట్ మాట్లాడుతూ, తమ కంపెనీ AI ఆధారిత సొల్యూషన్స్‌పై దృష్టి పెడుతోందని చెప్పారు. అయితే, తాము ఓపెన్ఏఐ లేదా గూగుల్ లాగా AI మోడల్స్‌ను తయారు చేయడం లేదని, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచే AI ఏజెంట్స్‌పైనే ఫోకస్ చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
* గూగుల్ AI, ఇంకా చాలా టెక్నాలజీలు..
కొత్త AI ఫోన్‌తో స్మూత్‌గా పనిచేసేలా "మెజెంటా AI" అనే అసిస్టెంట్ అప్లికేషన్‌ను కూడా డ్యూయిష్ టెలికామ్ తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో గూగుల్ క్లౌడ్ AI, ఎలవెన్‌లాబ్స్, పిక్స్ఆర్ట్ వంటి అనేక AI టెక్నాలజీలను కూడా అందించనున్నారు. దీని డిజైన్ చాలా సింపుల్‌గా, ఫంక్షనల్‌గా ఉంటుందని సమాచారం.
బడ్జెట్ లేదా మిడ్-రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్ స్టైల్‌లో, కాస్త మందపాటి బెజెల్స్‌తో, పింక్ కలర్ స్లీప్/వేక్ బటన్‌తో రానుందని తెలుస్తోంది. అయితే ఫోన్ హార్డ్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, తయారీ ఎక్కడ జరుగుతుంది వంటి ముఖ్యమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడించవచ్చు.
* "ఆన్సరింగ్ మెషీన్ కాదు, యాక్షన్ మెషీన్"
సుమారు 9 బిలియన్ డాలర్ల విలువ కలిగిన పెర్‌ప్లెక్సిటీ సంస్థ, AI సెర్చ్‌ను దాటి కొత్త రంగాల్లోకి అడుగుపెడుతోందని కో-ఫౌండర్ అరవింద్ శ్రీనివాస్ తెలిపారు. పెర్‌ప్లెక్సిటీ అంటే ఇకపై కేవలం "సమాధానాలు చెప్పే మెషీన్" కాదని, "పనులు చేసి పెట్టే యాక్షన్ మెషీన్" అని ఆయన అన్నారు.
* యాపిల్, శామ్‌సంగ్‌లకు పోటీ!
ఈ AI స్మార్ట్‌ఫోన్ మొబైల్ టెక్నాలజీలో ఒక పెద్ద మార్పుకు నాంది పలకనుంది. యాపిల్, శామ్‌సంగ్ వంటి దిగ్గజ కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. డీప్ AI ఇంటిగ్రేషన్‌తో, ప్రజలు తమ ఫోన్లతో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని ఇది పూర్తిగా మార్చేస్తుంది. రోజువారీ పనులను సులువుగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న నెలల్లో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications








