Home
Mobile

ఫిలిప్స్ కొత్త ఫార్ములా క్లిక్ అవుతుందా..?

By Prashanth
Philips


మన్నికైన బ్యాటరీ బ్యాకప్ ప్రధానాంశంగా ఫిలిప్ప్ సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్‌లను భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. Xenium బ్రాండ్ కింద ఈ హ్యాండ్‌సెట్‌లు విడుదలకానున్నాయి. వీటిలో కొన్ని ఫోన్‌లు 3 అంగుళాల టచ్‌స్ర్కీన్‌ను కలిగి ఉండగా, మరికొన్ని 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లలో Xenium X513, X116, X121 మోడళ్లు రూ.2,000 నుంచి 5,000 ధరల మధ్య లభిస్తాయి. డ్యూయల్ సిమ్, కెమెరా, ఎల్‌ఈఢి టార్చ్, మన్నికైన బ్యాటరీ వంటి సమర్థవంతమైన అంశాలను వీటిలో నిక్షిప్తం చేశారు.

మరో మోడల్ Xenium X726 దివాలీ కానుకగా విడుదల కాబోతుంది. ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ వోఎస్ ఆధారితంగా స్పందించే ఈ డివైజ్ బ్యాటరీ 40 రోజుల స్టాండ్ బై, 15 గంటల టాక్ టైమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. మరో స్మార్ట్‌ఫోన్ Xenium X9320 4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్‌ను కలిగి ఉత్తమ మొబైలింగ్ ఫీచర్లను ఒదిగి ఉంటుంది.

మరో స్మార్ట్‌ఫోన్ ఫిలిప్ప్W635 ఫీచర్లు:

డ్యూయల్ సిమ్, 4’’ టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్, 5 మెగా పిక్సల్ కెమెరా, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), అడిర్నో 200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 70ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32జీబి ఎక్సటర్నల్ స్టోరేజ్, క్యాండి బార్ డిజైన్, ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ ప్రాసెసర్, లియాన్ 1630 బ్యాటరీ (స్టాండ్ బై 200 గంటలు, టాక్ టైమ్ 5గంటలు).

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X