భారత్‌లోకి ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

Posted By:

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ రంగంలో అంతర్జాతీయంగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఫిలిప్స్ (Philips) ఇండియన్ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మే 28న న్యూఢిల్లీ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డచ్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫిలిప్స్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి గిజ్‌బాట్ బృందానికి ఇప్పటికే ఆహ్వానం అందింది.

 భారత్‌లోకి ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

ఫిలప్స్ ఆవిష్కరించబోయే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ.5,000 నుంచి రూ.25,000 మధ్య ఉండొచ్చిన తెలుస్తోంది. ఈ ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను అదే కార్యక్రమంలో ఫిలిప్స్ వెల్లడించనుంది. ఫిలిప్స్ ఇప్పటికే తన స్మార్ట్‌ఫోన్‌లను చైనా మార్కెట్లో విక్రయిస్తోంది. అయితే, భారత్‌లో ప్రవేశపెట్టబోయే ఫిలిప్స్ ఫోన్‌లు ఏ మేరకు విజయవంతమవుతాయో వేచి చూడాలి. ఏదేమైనప్పటికి ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఫిలిప్స్‌కు ‘ఆల్ ద బెస్ట్'.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot