దీపావళికి మొబైల్ సంబరాలు...

Posted By: Super

దీపావళికి మొబైల్ సంబరాలు...

ఫిలిప్స్ మొబైల్ హ్యాండ్ సెట్స్ మార్కెట్లో అంత గిరాకీ లేకపోయినప్పటికీ ఎలక్ట్రానిక్స్ రంగం పరంగా చూస్తే ఇండియాలో టాప్ కంపెనీలలో ఒకటిగా పేర్కోవొచ్చు. సాధారణంగా ఫిలిప్స్ ఎప్పుడైనా మొబైల్స్‌ని విడుదల చేస్తే ఆ మొబైల్స్‌కి సంబంధించి టివిలలో, పత్రికలలో వీడియోస్, యాడ్స్ పెద్దగా ప్రకటించని విషయం తెలిసిందే. కానీ ఫిలిప్స్ మొట్టమొదటసారి మార్క్టెట్లోకి రెండు 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్స్‌ని విడుదల చేస్తున్న సందర్బంగా కొంచెం హాడావుడి చేయడం ప్రారంభించింది. ఇండియన్ మార్కెట్లో ఈ రెండు ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్స్‌ని విడుదల చేయడం వల్ల మొబైల్స్ సేల్స్‌పై ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు.

మార్కెట్లోకి ఫిలిఫ్స్ విడుదల చేయనున్న ఈ రెండు ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్స్‌ల పేర్లు ఫిలిఫ్స్ ఎక్స్ 726, ఫిలిఫ్స్ ఎక్స్ 9320. ఈ రెండింటిని మార్కెట్లోకి విడుదల చేయక ముందు ఫిలిఫ్స్ తన అమ్ములపోది లోకి జీనియమ్ బ్రాండ్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిలిప్స్ ప్రవేశపెట్టనున్న ఈ రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కూడా 5 మెగా ఫిక్సల్ కెమెరా, డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు, యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను వీటి యొక్క స్క్రీన్ సైజు 3 ఇంచ్‌ డిస్ ప్లేగా రూపొందించడం జరిగింది.

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌ని అందిస్తుందని ఫిలిఫ్స్ అధికారులు వెల్లడించారు. ఫిలిఫ్స్ ఎక్స్ 726 మొబైల్ విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ స్మార్ట్ పోన్. ఫిలిఫ్స్ ఎక్స్ 726 మొబైల్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌తో పాటు ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ మొబైల్ గురించి విన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఈ మొబైల్ విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇందులో నిక్షిప్తం చేసిన Li ion బ్యాటరీ వల్ల బ్యాటరీ టాక్ టైం 40 రోజులు రాగా, అదే బ్యాటరీ టాక్ టైం 15 గంటలుగా వస్తుందంట. వీటితో పాటు ప్రయాణాలలో పాటలు వినేందుకు గాను ఇందులో ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేక ఆకర్షణ.

ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను కూడా సపోర్ట్ చేయనున్నాయి. ఇకపోతే ఫిలిప్స్ ఎక్స్ 9320 డిస్ ప్లే సైజు 4.3ఇంచ్ గా రూపొందించడం జరిగింది. ఫిలిప్స్ ఎక్స్ 9320 కూడా డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇక ఈరెండు మొబైల్స్‌కి సంబంధించిన ధరను మాత్రం ఇంకా మార్కెట్లో ప్రవేశపెట్టలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot