ఫిలిప్స్ కంపెనీ నుండి కొత్తగా 'ఆరు' టచ్ ఫోన్స్...

Posted By: Super

ఫిలిప్స్ కంపెనీ నుండి కొత్తగా 'ఆరు' టచ్ ఫోన్స్...

ఇండియాలో ప్రస్తుతం అభివృద్ది చెందుతున్న మార్కెట్‌గా మొబైల్ మార్కెట్‌ని అభివర్ణించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లైతే మొబైల్ మార్కెట్ అభివృద్ది కూడా అలానే ఉందని అనడంలో ఎటువంటి సందేహాం లేదు. ప్రసుతం ఇండియన్ మొబైల్ మార్కెట్‌ని టచ్ ఫోన్స్ డామినేట్ చేస్తున్న విషయం అందిరికి తెలిసిందే. ఎలక్ట్రానిక్ రంగంలో నెంబర్ వన్ స్దానంలో కొనసాగుతున్న ఫిలిప్స్ కంపెనీ కొత్తగా ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ఆరు కొత్త టచ్ ఫోన్స్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

ఫిలిప్స్ విడుదల చేయనున్న ఈ టచ్ స్క్రీన్ మొబైల్ పోన్స్ యూజర్స్ యొక్క అవసరాలను తీర్చే విధంగా ఉండబోతున్నాయని ఫిలిప్స్ అధికార ప్రతినిధులు తెలియజేశారు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో నెలలో టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎవరైతే యూజర్స్ ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ని కొరుకుంటారో అటువంటి వారికి మేము విడుదల చేయనున్న మొబైల్స్ తప్పనిసరిగా నచ్చుతాయని తెలియజేశారు. మేము విడుదల చేయనున్న ఆరు టచ్ స్క్రీన్ ఫోన్లలలో రెండు మొబైల్స్ డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో రూపోందించబడ్డాయి. మిగిలిన వాటిల్లో మూడు క్యాండీ బార్ మోడల్‌కి సంబందించినవి. ఆ ఆరోవ మొబైల్ ఫీచర్స్ మాత్రం ఇంకా మార్కెట్లో వెల్లడించలేదు.

ఫిలిఫ్స్ విడుదల చేయనున్న రెండు డ్యూయల్ సిమ్ పేర్లు ఫిలిప్స్ ఎక్స్ 806 బ్లాక్, ఫిలిప్స్ ఎక్స్ 518 బ్లాక్. ఎక్స్ 806 మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఎల్‌ఈడి ఫ్లాష్ తో 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడంతో పాటు 3 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే దీని సొంతం. ఇందులో రూపోందించబడిన 1530 mAh Liion బ్యాటరీ సహాయంతో యూజర్స్ 70 గంటలు పాటు మ్యూజిక్‌ని ఆస్వాదించవచ్చు. అదే స్టాండ్ బై మోడ్‌లో ఉంచితే సుమారుగా నెల రోజులు పాటు బ్యాటరీ బ్యాక్ అప్ వస్తుందని సమాచారం. అదే ఫిలిప్స్ ఎక్స్ 518 బ్లాక్ మాత్రం 2.8 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంది. కెమెరా కూడా 2 మెగా పిక్సల్ కెమెరాని మాత్రమే ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది.

మొబైల్స్‌‌తో కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్టాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఫిలిప్స్ విడుదల చేయనున్న ఈ మొబైల్స్‌లలో బ్యాటరీ బ్యాక్ అప్ ఇంత ఎక్కవ సేపు ఉండడానికి గల కారణం కొత్తగా 'Xenium' అనే టెక్నాలజీని వాడడం జరిగింది. మిగిలిన ఫోన్ల గురించిన సమాచారం త్వరలోనే మీ వన్ ఇండియా మొబైల్‌లో చూడోచ్చు. ప్రస్తుతానికి డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్లకు సంబంధించిన సమాచారం మాత్రమే వెల్లడించడం జరిగింది. మార్కెట్లోకి వీటికి సంబంధించిన ధరలను కూడా వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot