స్మార్ట్‌గా ఉండి, వెడల్పు డిస్ ప్లే‌తో...

Posted By: Super

స్మార్ట్‌గా ఉండి, వెడల్పు డిస్ ప్లే‌తో...

 

ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఏది కొద్ది పాటి మొబైల్ షేర్‌ని ఆక్రమించుకున్న ఫిలిఫ్స్ మొబైల్ కంపెనీ తన ఉనికిని చాటుకునేందుకు గాను అప్పడప్పడు స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఫిలిప్స్  మార్కెట్లోకి విడుదల చేసిన 'ఫిలిప్స్ డబ్ల్యు 920' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలను వన్ ఇండియా మొబైల్ పాఠకులకు సంక్షిప్తంగా అందజేయడం జరుగుతుంది.

ఫిలిప్స్ డబ్ల్యు 920 ప్రత్యేకతలు:

* డిస్ ప్లే: 4.3-inch touchscreen display

* డిస్ ప్లే రిజల్యూషన్: 800 x 480 pixels

* ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.2 Froyo Operating System

* సిపియు: 1 GHz processor

* RAM: 512MB

* కెమెరా: 5 megapixel with auto-focus and flash

* 3జీ: HSDPA

* వైర్ లెస్ ల్యాన్: Yes

* బ్లూటూత్: Yes

* జిపిఎస్: Yes

* కలర్: black with gold

ఫిలిప్స్ డబ్ల్యు 920 మొబైల్ ఫీచర్స్‌ని గనుక గమనించినట్లేతే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 4.3 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. ఇక స్క్రీన్ డిస్ ప్లే రిజల్యూషన్ 800 x 480 ఫిక్సల్స్. మొబైల్ ఫెర్పామెన్స్ అధ్బుతంగా ఉండేందుకు గాను ఇందులో 1 GHz ప్రాససెర్‌తో పాటు, ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

మొబైల్‌తో పాటి ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్దు ద్వారా మెమరీని విస్తరించుకొవచ్చు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కమెరా సహాయంతో అందమైన పోటోలను మాత్రమే కాకుండా, వీడియోలను కూడా తీయవచ్చు. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పైలను సపోర్ట్ చేస్తుంది.  3జీ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో స్టాండర్డ్ బ్యాటరీని పొందుపరచారు.  ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఇంకా దీని ధరను అధికారకంగా వెల్లడించ లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot