మార్కెట్లోకి ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్ ‘జీనియమ్ డబ్ల్యూ6610’

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిలిప్స్ మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఓ ఫీచర్ ఫోన్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. డబ్ల్యూ6610, డబ్ల్యూ3500, ఎస్308 మోడల్స్‌లో ఈ ఫోన్‌లు లభ్యంకానున్నాయి. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ వ్యవస్థను ఈ ఫోన్‌లలో ఏర్పాటు చేసారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

 

ముందుగా ఫిలిప్స్ W6610 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 5300ఎమ్ఏహెచ్ బ్యాటరీ (33 గంటల టాక్‌టైమ్, 1604 గంటల స్టాండ్‌బై టైమ్), ఫోన్ ధర రూ.20,650.

మరో ఫోన్ ఫిలిప్స్ డబ్ల్యూ3500 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల FWVGA డిస్‌ప్లే,1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెుమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫోన్ ధర రూ.16,195.

 మార్కెట్లోకి ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మరో ఫోన్ ఫిలిప్స్ ఎస్308 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 4 అంగుళాల WVGA డిస్‌ప్లే, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ 6572ఎమ్ ప్రాసెసర్, 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, ఫోన్ ధర రూ.8,290.

ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఇ130 పేరుతో ఓ ఫీచర్ ఫోన్‌ను ఫిలిప్స్ ఆవిష్కరించింది. ధర రూ.1960. ఫోన్ ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే... డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, డిజిటల్ కెమెరా, ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీ3 ప్లేయర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X