ఎప్పుడూ ఫ్రిజ్, ఏసి ఉత్పత్తులేనా.. అప్పుడప్పుడు మొబైల్స్ కూడా

By Super
|
Philips Xenium X086
ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను తయారు చేసే ఫిలిఫ్స్ కంపెనీ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి అడుగు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకొనుంది. ఇండియాలోకి ఫిలిప్స్ కంపెనీ కొత్తగా డ్యూయల్ సిమ్ మొబైల్ ఫిలిఫ్స్ జీనియమ్ ఎక్స్ 806ని విడుదల చేయనుంది. ఫిలిఫ్స్ విడుదల చేసిన ఈ జీనియమ్ ఎక్స్ 806 మొబైల్‌కి రష్యా, యూరప్‌లలో మంచి రికార్డు ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హై ఎండ్ మొబైల్స్‌కి ఏమేమి ఫీచర్స్ ఐతే ఉన్నాయో అలాంటి అన్ని ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇండియాలో డ్యూయల్ సిమ్ విభాగంలో విడుదలవుతున్న ఈ మొబైల్ తప్పనిసరిగా యూజర్స్ మనసుని దొచుకుంటుందని అంటున్నారు. యూజర్స్‌కు చక్కని దృశ్యా ఆనందాన్ని అందించేందుకు గాను 3.0 ఇంచ్ డిస్ ప్లే స్క్రీన్ దీని సొంతం. ఇది మాత్రమే కాకుండా 240 X 400 ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉండడం వల్ల ఇమేజిలను అందంగా చూడొచ్చు. ఇక కమెరా విషయానికి వస్తే 5మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. ఆటో ఫోకస్, ఎల్‌ఈడి సపోర్ట్ కెమెరాకి అదనపు ఆకర్షణ. వీడియో కాలింగ్ పీచర్‌ని సపోర్ట్ చేసేందుకు గాను ఇందులో సెకండరీ కెమెరా మాత్రం లేదు.

 

ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్ వర్సన్ 2.0ని సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు జిపిఎస్, ఎడ్జి టెక్నాలజీని కూడా ఫిలిప్స్ జీనియమ్ ఎక్స్ 806 ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా యూజర్స్‌ని ఎటువంటి నిరాశకు గురిచేయదు. మార్కెట్లో లభ్యమవుతున్న ఆడియో, వీడియో ఫార్మెట్లు అయిన MP3, WAV, WMA, MP4 వాటిని సపోర్ట్ చేస్తుంది. వాయిస్ మోమో ఫీచర్ అదనపు ఆకర్షణ. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 8 జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది.

 

పవర్ మేనేజ్‌మెంట్ విషయంలో కూడా యాజర్స్‌ని నిరాశ పరచదు. కంటిన్యూగా మొబైల్‌తో మాట్లాడితే 8 గంటలు పాటు ఛార్జింగ్‌ని ఇస్తుంది. స్టాండ్ బై టైమ్ 720 గంటలు. ప్రస్తుతానికి ఫిలిప్స్ జీనియమ్ ఎక్స్ 806కి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించలేదు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 10,000గా ఉండవచ్చునని నిపుణుల అభిప్రాయం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X