పొటీకి సిద్దమైన ఫిలిప్స్, వ్యాన్ కామ్

Posted By: Staff

పొటీకి సిద్దమైన ఫిలిప్స్, వ్యాన్ కామ్

డ్యూయల్ సిమ్ ఫోన్స్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఎప్పటికీ ఫేవరేటే. అందుకే కాబోలు గ్లోబల్‌గా మొబైల్స్‌ని తయారు చేసే అన్నిసంస్దలు కూడా వాటివాటి డ్యూయల్ సిమ్ ఫోన్స్‌ మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇప్పడు కొత్తగా ఇదే దారిలోకి రెండు కొత్త మొబైల్ తయారీ సంస్దలు వచ్చాయి. ఈ రెండు తయారీ సంస్దలు ఎవరెవరా అని అనుకుంటున్నారా.. ఒకటి ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామిగా ప్రజల మన్ననలను అందుకుంటున్న ఫిలిప్స్ కంపెనీ కాగా, రెండవది వ్యాన్ కామ్ సంస్ద. ఫిలప్స్ నుండి ఫిలిప్స్ జీనియమ్ ఎక్స్ 806 డ్యూయల్ సిమ్ ఫోన్ రాగా, వ్యాన్ కామ్ నుండి వ్యాన్ కామ్ 702 అనే డ్యూయల్ సిమ్ ఫోన్‌ని మార్కెట్లోకి త్వరలో విడుదల చేయనున్నాయి. ఈ రెండు ఉత్పత్తిదారులు విడుదల చేయనున్న మొబైల్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించి చూద్దాం..

ఫిలిప్స్ జీనియమ్ ఎక్స్ 806 మొబైల్ ఫీచర్స్:

ఫిలిప్స్ జీనియమ్ ఎక్స్ 806 మొబైల్‌లో యూజర్స్‌కు చక్కని దృశ్యా ఆనందాన్ని అందించేందుకు గాను 3.0 ఇంచ్ డిస్ ప్లే స్క్రీన్ దీని సొంతం. ఇది మాత్రమే కాకుండా 240 X 400 ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉండడం వల్ల ఇమేజిలను అందంగా చూడొచ్చు. ఇక కమెరా విషయానికి వస్తే 5మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. ఆటో ఫోకస్, ఎల్‌ఈడి సపోర్ట్ కెమెరాకి అదనపు ఆకర్షణ. వీడియో కాలింగ్ పీచర్‌ని సపోర్ట్ చేసేందుకు గాను ఇందులో సెకండరీ కెమెరా మాత్రం లేదు.

ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్ వర్సన్ 2.0ని సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు జిపిఎస్, ఎడ్జి టెక్నాలజీని కూడా ఫిలిప్స్ జీనియమ్ ఎక్స్ 806 ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా యూజర్స్‌ని ఎటువంటి నిరాశకు గురిచేయదు. మార్కెట్లో లభ్యమవుతున్న ఆడియో, వీడియో ఫార్మెట్లు అయిన MP3, WAV, WMA, MP4 వాటిని సపోర్ట్ చేస్తుంది. వాయిస్ మోమో ఫీచర్ అదనపు ఆకర్షణ. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 8 జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. కంటిన్యూగా మొబైల్‌తో మాట్లాడితే 8 గంటలు పాటు ఛార్జింగ్‌ని ఇస్తుంది. స్టాండ్ బై టైమ్ 720 గంటలు. ప్రస్తుతానికి ఫిలిప్స్ జీనియమ్ ఎక్స్ 806కి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించలేదు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 10,000గా ఉండవచ్చునని నిపుణుల అభిప్రాయం.

వ్యాన్ కామ్ 702 మొబైల్ ఫీచర్స్:

వ్యాన్ కామ్ 702 మొబైల్‌లో డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు, మల్టీ టచ్ స్క్రీన్ ఫెసిలిటీని కూడా కలిగి ఉన్నాయి. డబ్ల్యు-702 మొబైల్ ఫీచర్స్ చూస్తే 2.8 ఇంచ్ డిస్ ప్లే కలగి ఉంది. మీకు సంబంధించిన అందమైన క్షణాలను అందంగా భద్రపరచుకోవడానికి గాను 2 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. దీని సహాయంతో హై క్వాలిటీ ఇమేజిలను తీయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త మొబైల్ తయారీదారులు బ్యాటరీ బ్యాక్ అప్‌ని కూడా చక్కగా అందిస్తున్నారు. పవర్ బ్యాక్ అప్ విషయంలో ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్న వ్యాన్ కామ్ మొబైల్స్ సంస్ద సూపర్ క్వాలిటీ 1200 mAh బ్యాటరీని రెండు మొబైల్స్‌లలో నిక్షిప్తం చేయడం జరిగింది.

మొబైల్స్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌‌డి స్లాట్ ద్వారా డబ్ల్యు-702లో మొమొరీని 16జిబి వరకు విస్తరించుకోవచ్చు. డబ్ల్యు-702 మొబైల్‌ ధర ఇండియన్ మొబైల్ మార్కెట్లో రూ 2,995గా నిర్ణయించడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot