ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలు
ఫోన్ బ్యాటరీ చార్జింగ్‌కు సంబంధించి అనేక సందేహాలు, అపోహలు పలువురిలో వ్యక్తమవుతుంటాయి. వాస్తవానికి, మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ ఆయువు పట్టు లాంటిది. బ్యాటరీ చార్జింగ్ లేకుంటే ఫోన్ స్పందించటమే మానేస్తుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలు
నాసిరకం చార్జర్లు ఫోన్ బ్యాటరీని నాశనం చేస్తాయంటారు నిజమేనా..?
అవును, నాసిరకం చార్జర్లతో తక్కువ నాణ్యతతో కూడిన హార్డ్‌వేర్‌ను ఉపయోగిచటం వల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై ఎంతో కొంత దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, బ్యాటరీ చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్‌లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం.

ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలు
ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ మాట్లాడమనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే చార్జింగ్‌ను ఆఫ్ చేసి మాట్లాడండి.

ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలు
రాత్రివేళ ఫోన్ చార్జింగ్ పెట్టి మర్చిపోతే బ్యాటరీ పనికిరాకుండా పోతుందంటారు నిజమేనా..?
మీ ఫోన్ మీ కంటే చాలా తెలివైనది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యాక పవర్‌ను తీసుకోవటం ఆటోమెటిక్‌గా మానేస్తుంది. అయితే, నాసిరకం బ్యాటరీలు పలు సందర్భాల్లో మోరాయిస్తుంటాయి.

ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలు
రాత్రివేళ ఫోన్‌ను ఆఫ్ చేయటం మంచిదేనా..?
అవును, మీ ఫోన్ కూడా ఓ యంత్రం లాంటిదే. దానికి ఎంతోకొంత విరామం అవసరమవుతుంది. రాత్రివేళ్లలో మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్‌ను ఆఫర్ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను మరింతగా పెంచుకోవచ్చు.

ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలు
ప్రతిసారీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత చార్జింగ్ ప్రక్రియ మొదలెట్టడం మంచిదేనా..?
ఈ ప్రక్రియ మంచిదే కానీ, క్రమం తప్పకుండా ఇలా చేయటమేనేది పలు సందర్భాల్లో కష్టమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫోన్ చార్జింగ్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవటం ఉత్తమం.

ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలు
అధిక వేడి బ్యాటరీ బ్యాకప్‌ను హరించి వేస్తుందా..?
అవును, వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం వల్ల బ్యాటరీ పై ఆ వేడి ఉష్ణోగ్రతలు కచ్చితంగా దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకు వేడి వాతావరణంలో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉంచొద్దు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








