విమానం నుంచి పడినా చెక్కు చెదరని ఫోన్, షాకిచ్చిన శాంసంగ్ S5

Written By:

ఈ ఫోన్ పాత రికార్డులను బద్దలు కొట్టింది. దాదాపు 1000 అడుగుల ఎత్త నుంచి కిందపడినా చెక్కు చెదరలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కింద పడినప్పటికీ వీడియో రికార్డు అవుతూనే ఉంది. ఇంతకీ ఆ ఫోన్ ఏంటో తెలుసా..శాంసంగ్ కంపెనీకి చెందిన శాంసంగ్ ఎస్ 5 స్మార్ట్ ఫోన్.

ఈ ఫోన్ శాశ్వతం : తడవదు, పగలదు, బడ్జెట్ ధరకే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొన్ని వేల అడుగుల ఎత్తునుంచి

చేతిలోంచి జారి పడిన వెంటనే పగిలే స్మార్ట్ ఫోన్, కొన్ని వేల అడుగుల ఎత్తునుంచి పడినప్పటికీ, ఏ మాత్రం చెక్కు చెదరలేదని తెలిపే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఓ చిన్న విమానంలో

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ చిన్న విమానంలో యూఎస్ లోని టెన్నెస్సీ ప్రాంతానికి చెందిన బ్లేక్ హెండర్స్ న్ ప్రయాణిస్తున్నాడు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్ ను

ఆ సమీపంలో మరో పెద్ద విమానం అత్యంత సమీపంలోకి దూసుకు వచ్చింది. దీన్ని వీడియో తీద్దామని అనుకున్న బ్లేక్, తన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్ ను బయటకు తీశాడు.

అంతఎత్తు నుంచి కిందకు పడుతూ

ఆ సమయంలో చేతిలోంచి మొబైల్ జారిపోయింది. అయితే అంతఎత్తు నుంచి కిందకు పడుతూ కూడా శాంసంగ్ S5 చుట్టు పక్కల దృశ్యాలను వీడియో తీసింది.

పడినప్పుడు కూడా ఆ ఫోన్

ఓ ఇంట్లోని పెరడులో ఆ ఫోన్ పడింది. అలా పడినప్పుడు కూడా ఆ ఫోన్ వీడియో తీస్తూనే ఉంది. ఆ ఇంట్లోవారు ఫోన్ పడటాన్ని గమనించి, దాన్ని తీసుకుని పరిశీలిస్తున్న దృశ్యాలూ రికార్డయ్యాయి.

వీడియోను యూ ట్యూబ్ లో పోస్టు చేయగా

ఫోన్ లోని జీపీఎస్ సాయంతో తన మొబైల్ ఎక్కడుందన్న విషయాన్ని బ్లేక్ కనుగొని ఫోన్ ను తిరిగి పొందాడు. అంత ఎత్తునుండి పడినా ఫోన్ పై ఎలాంటి డ్యామేజీ లేకపోగా, చిన్నగీతలు కూడా పడలేదట. ఈ వీడియోను యూ ట్యూబ్ లో పోస్టు చేయగా, అదిప్పుడు వైరల్ అయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The phone that fell to Earth: Smartphone RECORDS its 1,000ft fall from a plane - before it's found in a man's garden who exclaims 'that ain't my phone' Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot