ఈ ‘మోడల్’ పెద్దల కోసమేనా..?

Posted By: Super

 ఈ ‘మోడల్’ పెద్దల కోసమేనా..?

 

కమ్యూనికేషన్ ప్రపంచంలో కొత్త ఒరవడి స్ళష్టిస్తున్న స్మార్ట్ ఫోన్స్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీటి డిమాండ్ తారాస్థాయికి చేరుకోవటంతో పలు కంపెనీలు ఈ విభాగం పై ద్ళష్టిసారిస్తున్నాయి. నోకియా, శామ్‌సంగ్, ఆపిల్, ఎల్‌జీ వంటి దిగ్గజ కంపెనీలు పలు వేరియంట్‌లలో స్మార్ట్ మొబైల్స్‌ను ప్రవేశపెట్టి సఫలీక్ళతం కాగా మరికొన్ని కంపెనీలు మార్కెట్ పై పట్టు పెంచుకుంటున్నాయి. ఈ కోవకే చెందిన ‘డోరా’ తాజాగా మొబైల్‌ఫోన్‌ల తయారీ ఇండస్ట్ర్రీలోకి అరంగ్రేటం చేసింది. వృద్ధ వయసు ప్రజలను ఆకట్టకునే క్రమంలో స్లైడర్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూపొందించింది. ఈ ఫోన్ పేరు ‘PhoneEasy 740’. ఈ ఏడాది ప్రధమాంకంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ డివైజ్ డోరో ఎక్స్పీరియన్స్‌ను అందిస్తుంది. ఫోన్‌లో పొందుపరిచిన డోరో సాఫ్ట్‌వేర్ యూజర్ ఫ్రెండ్లీ స్వభావాన్ని కలిగి అప్లికేషన్‌ల పనివేగాన్ని రెట్టింపు చేస్తుంది.

ఫోన్ కీలక ఫీచర్లు:

* 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* అంతరాయంలేని 4 గంటల టాక్ టైమ్,

* 512ఎంబీ ర్యామ్ ,

* 3.2 అంగుళాల HVGA షూటర్,

* ఇంటర్నల్ మెమరీ 4జీబి,

* ఈజీ పుష్ బటన్స్,

* టీ9 వెర్టికల్ స్లైడర్,

* సందేశాలు పంపుకునేందుకు సౌకర్యవంతమైన కీబోర్డ్ వ్యవస్థ.

కాల్స్ నిర్వహించుకోవటంతో పాటు వేగవంతమైన నెట్ బ్రౌజింగ్ కు ఈ హ్యాండ్ సెట్ సమర్థవంతంగా తోడ్పడుతుంది. ఫోన్ ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot