64MP కెమెరా గల రూ.52,999 ఫోన్ ఇప్పుడు కేవలం రూ.34,999కే.. ఇంతకంటే బెస్ట్ డీల్ మళ్లీ రాదు!
Pixel 8a Price Slashed: పిక్సెల్ 9a కోసం వెయిట్ చేసే ఓపిక లేకపోతే, తక్కువ ధరలో పిక్సెల్ ఫోన్ అనుభూతి పొందాలనుకుంటే, ఈ ఆఫర్ మీ కోసమే. గూగుల్ పిక్సెల్ 8a అసలు ధర రూ.52,999 కాగా, ఇప్పుడు రూ.34,999కే సొంతం చేసుకోవచ్చు. పిక్సెల్ ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్ ఎప్పుడూ రాలేదు, వెంటనే తీసుకోకపోతే ఈ ఆఫర్ మిస్సయిపోతారు. పిక్సెల్ 8aపై ఏకంగా రూ.18,000 డిస్కౌంట్ ఎలా అందుకోవచ్చో చూద్దాం.
ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 8a (128GB) ఫోన్‌ని ఇప్పుడు డిస్కౌంట్ ధర రూ.37,999కి అమ్మకానికి పెట్టారు. మీ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, అదనంగా మరో రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. అంటే ఫోన్ ధర అక్షరాలా రూ.34,999కి పడిపోతుంది. అన్ని కలర్ వేరియంట్స్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అంతేకాదు, నెలవారీ వాయిదాల (నో-కాస్ట్ EMI) ద్వారా కూడా కొనుక్కోవచ్చు, అది కూడా 24 నెలల వరకు. దీంతో ఫోన్ కొనుగోలు మరింత సులువు అవుతుంది. దీనిపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉన్న మాట వాస్తవమే కానీ ఈ ఫోన్ అసలు కొనుగోలు చేయొచ్చా? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
* పిక్సెల్ 8a కొనొచ్చా? కొనకూడదా?
పిక్సెల్ 8 మోడల్‌కి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ వెర్షన్. పిక్సెల్ 8a వెనుక ప్లాస్టిక్‌తో వస్తే, పిక్సెల్ 8 మాత్రం గ్లాస్‌తో వస్తుంది. స్క్రీన్ విషయానికొస్తే, 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే HDR సపోర్ట్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ చుట్టూ బెజెల్స్ కాస్త మందంగా ఉన్నా, డిజైన్ మాత్రం చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది.
కెమెరా విషయానికొస్తే, 64MP మెయిన్ కెమెరా ఉంటుంది. పిక్సెల్ 8లో 50MP సెన్సార్ ఉన్నా, ఫొటోలు మాత్రం అదిరిపోతాయి. అంటే పిక్సెల్ 8 అనేది పిక్సెల్ 8a కంటే మరింత క్వాలిటీ గల ఫొటోలు వీడియోలు తీయగలదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
* గూగుల్ పిక్సెల్ 8a ఫీచర్లు
గూగుల్ టెన్సర్ G3 (4nm) చిప్‌సెట్‌తో పనిచేసే పిక్సెల్ 8 ఫోన్, ఫ్లాగ్‌షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్‌ని అందిస్తుంది. 8GB RAM, 256GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఈ నీళ్లు, దుమ్ము ఏమీ చేయలేవు, ఎందుకంటే IP67 రేటింగ్ ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది, చాలా సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి.
బ్యాటరీ విషయానికొస్తే, 4,492mAh బ్యాటరీ ఉంటుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 7.5W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఇది సపోర్టు అందిస్తుంది. అయితే పిక్సెల్ 8 27W వైర్డ్, 18W వైర్‌లెస్ ఛార్జింగ్ కంటే చాలా నెమ్మదిగా ఈ మొబైల్ ఛార్జ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.
* ఎక్స్చేంజ్ ఆఫర్ తో మరింత తగ్గింపు..
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే, అందనంగా రూ.36,950 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ ఫోన్ కండిషన్ బాగుంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ద్వారా రూ.13,000 డిస్కౌంట్ వచ్చినా, పిక్సెల్ 8aని కేవలం రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు.
* ఇప్పుడే కొనాలా? వద్దా?
ఒకప్పుడు రూ.52,999 ధర కాస్త ఎక్కువ అనిపించినా, ఇప్పుడు రూ.34,999కి మాత్రం ఇది మంచి డీల్. ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే కెమెరా, మెరుగైన పర్ఫార్మెన్స్ అన్నీ తక్కువ ధరకే లభిస్తున్నాయి. పిక్సెల్ ఫోన్ వాడాలి అనుకుంటే, ఎక్కువ డబ్బులు పెట్టకుండా బెస్ట్ ఫోన్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం.


Click it and Unblock the Notifications








