ఈ ప్రదేశాల్లో సెల్‌ఫోన్ ఉంచడం చాలా ప్రమాదం
ఇప్పుడు అందరిచేతిలో ఖచ్చితంగా ఉండే పరికరం సెల్‌ఫోన్ ఒక్కటే. ఎక్కడికి వెళ్లినా మన చేతిలో ఈ ఫోన్ ఉండాల్సిందే.
ఇప్పుడు అందరిచేతిలో ఖచ్చితంగా ఉండే పరికరం సెల్‌ఫోన్ ఒక్కటే. ఎక్కడికి వెళ్లినా మన చేతిలో ఈ ఫోన్ ఉండాల్సిందే.అయితే కొన్ని ప్రదేశాల్లో మీరు మొబైల్ పెడితే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా నాలుగు చోట్ల ఫోన్ పెట్టుకుంటే ఆరోగ్యంగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. అవేంటో చూడండి.

ప్యాంట్ బ్యాక్ పాకెట్‌లో
ప్యాంట్ బ్యాక్ పాకెట్‌లో సెల్‌ఫోన్‌ని పెట్టుకోకూడదట. బ్యాక్ పాకెట్‌లో పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఫోన్ ఒత్తిడికి గురై బ్యాటరీ ఉబ్బే ప్రమాదముందని చెప్తున్నారు. ఆ బ్యాటరీ ఉబ్బితే ఆ ఫోన్ పేలే అవకాశాలున్నాయట.

ఏసీలు, ఫ్రిజ్‌లు ఉన్న దగ్గరలో
ఏసీలు, ఫ్రిజ్‌లు ఉన్న దగ్గరలో సెల్‌ఫోన్లు ఉంచకూడదట. ‘0' డిగ్రీస్ కంటే తక్కువ టెంపరేచర్‌లో సెల్‌ఫోన్ ఉంచడం వల్ల ఆ ఫోన్లో ఉన్న బ్యాటరీ సామర్ధ్యాన్ని కోల్పోతుందని పరిశోధకులు చెప్తున్నారు.

సెల్‌ఫోన్‌ని ఎండలో పెట్టి
సెల్‌ఫోన్‌ని ఎండలో పెట్టి మర్చిపోవడం లాంటివి చెయ్యకూడదట. అలా ఎండలో పెట్టి మర్చిపోవడం వల్ల బ్యాటరీ వేడెక్కి అందులో ఉన్న ద్రవం బయటకొచ్చి ఫోన్ పాడైపోయే అవకాశాలున్నాయట.

వంట చేస్తూ ఫోన్
ఇది ముఖ్యంగా ఆడవాళ్ల కోసం. కొంతమంది వంట చేస్తూ ఫోన్ మాట్లాడతారట. అలాంటి సమయంలో ప్రెజర్ కుక్కర్, స్టవ్‌కి దగ్గరలో ఫోన్‌ని ఉంచుతూ ఉంటారు. ఇది అన్నింటికంటే చాలా ప్రమాదమని పరిశోధకులు చాలా గట్టిగా చెప్తున్నారు.

నిద్ర పోయే సమయంలో
నిద్ర పోయే సమయంలో మొబైల్ దగ్గర పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం వల్ల నిద్ర చేడిపోయే ప్రమాదంతో పాటు ఫోన్ పేలితే గాయాలవడం ఖాయం.

స్నానం చేసే సమయంలో
స్నానం చేసే సమయంలో బాత్ రూంకి సెల్ తీసుకెళ్లొద్దు. ఒకవేళ తీసుకెళితే అది నీళ్లలో పడిపోయే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications








