Home
Mobile

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి బ్యాడ్ న్యూస్

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆశపడేవారికి ఇది నిజంగా షాకింగ్ లాంటి వార్తే.. ఎందుకంటే ఇకపై మొబైల్ ధరలు భారీగా పెరగనున్నాయి.

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆశపడేవారికి ఇది నిజంగా షాకింగ్ లాంటి వార్తే.. ఎందుకంటే ఇకపై మొబైల్ ధరలు భారీగా పెరగనున్నాయి. చైనా దిగ్గజాలు షియోమి, ఒప్పో, రియల్ మి లాంటి కంపెనీలు ఇకసై మొబైల్ ధరలను భారీగా పెంచనున్నాయి. దీనికి ప్రధాన కారణం రోజు రోజుకి ఇండియన్ కరెన్సీ పతనం కావడమే. గత కొద్ది రోజుల నుంచి రూపాయి డాలర్ తో పోల్చితే భారీగా పతనమవుతూ వస్తోంది. అదే ఊపులో డాలర్ భారీగా బలపడుతూ వస్తోంది.దీంతో ఉత్పత్తి వ్యయం కంపెనీలకు భారీగా పెరిగిపోయింది. ఈ వ్యయాన్ని తగ్గించుకోవాలంటే ఫోన్ ధరలను పెంచక తప్పడం లేదని దిగ్గజ మొబైల్ కంపెనీలు వాపోతున్నాయి.

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్...

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్...

మార్కెట్ విశ్లేషకుల ప్రకారం దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, చైనా దిగ్గజాలు ఒప్పో , వివో తమ పాత ఫోన్ల ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నాయని తెలుస్తోంది. కాగా డాలర్ తో పోల్చితే ఇండియా రూపాయి 15 శాతం మేర పతనమైందని కాబట్టి కొత్త మోడళ్లపై 5 నుంచి 8 శాతం వరకు ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

 షియోమి, రియల్ మి లు తమ ఫోన్ ధరలను పెంచితే...

షియోమి, రియల్ మి లు తమ ఫోన్ ధరలను పెంచితే...

కాగా చైనా మొబైల్ తయారీ కంపెనీలు షియోమి, రియల్ మి లు తమ ఫోన్ ధరలను పెంచితే ఆటోమేటిగ్గా మిగతా కంపెనీలు కూడా తమ ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

దివాళి పండుగ సీజన్లో తమకు నచ్చిన ఫోన్లను...

దివాళి పండుగ సీజన్లో తమకు నచ్చిన ఫోన్లను...

దివాళి పండుగ సీజన్లో 60 నుంచి 70 శాతం డిమాండ్ ఉందని కస్టమర్లు ఇప్పటికే తమకు నచ్చిన ఫోన్లను తీసుకున్నారని మళ్ళీ ఫోన్ వైపు ఇప్పట్లో కస్టమర్లు చూడకపోవచ్చని Counterpoint Research associate director Tarun Pathak చెబుతున్నారు.

ఇండియాలో టాప్ లో దూసుకుపోతున్న షియోమి...

ఇండియాలో టాప్ లో దూసుకుపోతున్న షియోమి...

ఇండియాలో టాప్ లో దూసుకుపోతున్న షియోమి తన ఫోన్ ధరలను పెంచితే Samsung, Oppo and Vivoలు కూడా తమ ఫోన్ల ధరలను పెంచుతాయని మేము అంచనా వేస్తున్నట్లు IDC India associate research director నవకేందర్ సింగ్ తెలిపారు.

 

 

ధరలు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం...

ధరలు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం...

కాగా ఈ ధరలు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే షియోమి తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు Redmi 6 and 6Aలపై రూ. 600 పెంచేసింది. రూపాయి పతనం ఇలానే కొనసాగితే ఈ ఫోన్ల ధరలు మరింతగా పెంచే ఆలోచనలో ఉన్నట్లే మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Planning to buy a smartphone? Here's bad news for you More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X