నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale.. స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు..!!
పోకో ఇండియా మే సేల్ (Poco May Sale 2024) పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పోకో స్మార్ట్‌ఫోన్లను డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ పోకో ప్రత్యేక సేల్ మే 1 నుంచి 10 వ తేదీ వరకు జరుగుతుంది.
ఈ మే సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన పోకో స్మార్ట్‌ఫోన్లను గరిష్ఠంగా రూ.4000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ జాబితాలో పోకో x6, పోకో x6 ప్రో మరియు X6 నియో వంటి ఫోన్‌లు ఉన్నాయి. వీటితోపాటు పోకో M6 ప్రో, పోకో C65 వంటి ఫోన్లను కూడా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

పోకో X6 ప్రో : ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 64 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. రూ.4000 తగ్గింపుతో 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.22999, అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 కే కొనుగోలు చేయవచ్చు.
పోకో X6 : హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల అమోలెడ్ 1.5k రిజల్యూషన్ డిస్‌ప్లే, క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రూ.4000 డిస్కౌంట్ ఆఫర్‌తో వస్తుంది. ఫలితంగా 8GB ర్యామ్ +256GB వేరియంట్ ధర రూ.17999 కే కొనుగోలు చేయవచ్చు. 12GB ర్యామ్ +512GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.20999 కే కొనుగోలు చేయవచ్చు.

పోకో X6 నియో : ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కూడా రూ.4000 తగ్గింపును పొందింది. ఫలితంగా 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.13999, 12GB ర్యామ్+256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.14999 కే కొనుగోలు చేయవచ్చు.
పోకో M6 ప్రో 5G : ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. 6.79 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది. ఈ మే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను గరిష్ఠంగా రూ.3500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999, అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, అదే 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది.
పోకో C65 : ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ G36 చిప్ పైన పనిచేస్తుంది. 6.71 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.6499 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.6999 గా ఉంది.


Click it and Unblock the Notifications








