Home
Mobile

ధర రూ.8,499 కే Poco కొత్త ఫోన్ లాంచ్! లాంచ్ ఆఫర్లో ఇంకా తక్కువ ధరకే

By Maheswara

వాగ్దానం చేసినట్లుగానే పోకో C సిరీస్‌లో కంపెనీ యొక్క తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ C51 ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.52″ HD+ LCD స్క్రీన్‌ని కలిగి ఉంది, అయితే ఇది C31 యొక్క హీలియో G35 బదులు హీలియో G36 SoCతో వస్తుంది.అందువల్ల ఇది అప్గ్రేడెడ్ వెర్షన్ లాగా వస్తుంది.

ఇది 4GB ర్యామ్‌తో పాటు అదనపు 3GB వర్చువల్ ర్యామ్‌ను పెంచుకునే అవకాశం కలిగి ఉంది. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌ను తీసుకువస్తుంది. మరియు ఈ ఫోన్ కోసం సంస్థ 2 సంవత్సరాల భద్రతా నవీకరణలను అందిస్తున్నట్లు ప్రకటించారు.

Poco C51 With Mediatek Helio G36 processor Launched In India. Price,Specifications And Offers Details Here.

ఇది 8MP వెనుక కెమెరాతో పాటు సెకండరీ డెప్త్ సెన్సార్ తో వస్తుంది.ఇంకా, 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. పోకో యొక్క ఈ C51 తోలు వంటి వెనుక డిజైన్, వెనుక మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు C31 మాదిరిగానే 10W ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

పోకో C51 యొక్క పూర్తి స్పెసిఫికేషన్ ల వివరాలు,
ఈ ఫోన్ 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.52-అంగుళాల (1600 x 720 పిక్సెల్‌లు) HD+ IPS LCD స్క్రీన్ ని కలిగి ఉంది. 2.2 GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G36 12nm ప్రాసెసర్,
4GB LPDDR4X RAM, 64GB eMMC 5.1 అంతర్గత నిల్వ, మైక్రో SDతో 1TB వరకు విస్తరించదగిన స్టోరేజీ ఎంపికలతో వస్తుంది.

ఇంకా, ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టం తో ఇది పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో + నానో + మైక్రో SD),8MP వెనుక కెమెరా f/2.0 ఎపర్చరు LED ఫ్లాష్, సెకండరీ కెమెరా
f/2.2 ఎపర్చరుతో 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లు కలిగి ఉంది. 3.5mm ఆడియో జాక్, FM రేడియో మరియు వెనుక-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా కనెక్టివిటీ వివరాలు చూస్తే ఇది డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 5.0, GPS + GLONASS, మైక్రో USB పోర్ట్ కలిగి ఉంది. 10W ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ధర మరియు లభ్యత వివరాలు,
ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 10 నుండి భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది, దీని ధర 4GB + 64GB వేరియంట్ కోసం రూ. 8,499 గా ఉంది. ఈ పోకో C51 పవర్ బ్లాక్ మరియు రాయల్ బ్లూ రంగులలో వస్తుంది. ఇది ఏప్రిల్ 10 నుండి మధ్యాహ్నం 12 గంటలకు Flipkart నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఇంకా, లాంచ్ రోజు ఆఫర్ కింద, ఈ ఫోన్ పై రూ.700 వరకు తగ్గింపు ఆఫర్ కూడా ప్రకటించారు.ఈ ఆఫర్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీలపై వర్తిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత మీరు ఈ ఫోన్ ని రూ.7,799 కి కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Poco C51 With Mediatek Helio G36 processor Launched In India. Price,Specifications And Offers Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X