Home
Mobile

ధర రూ.7499 కే 6.71 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌, స్పెసిఫికేషన్ల వివరాలు.!

పోకో సంస్థ భారత్‌ మార్కెట్‌లో త్వరలో C సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. పోకో C61 (Poco C61 Smartphone) హ్యాండ్‌సెట్‌ భారత్‌లో మార్చి 26న లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ డిజైన్‌, కలర్‌, ర్యామ్‌ మరియు ఇతర స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. అయితే ఈ పోకో C61 హ్యాండ్‌సెట్‌.. రెడ్‌మి A3 ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వచ్చినట్లు తెలుస్తోంది.

పోకో C61 స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ఏప్రిల్‌లో విడుదల అయిన పోకో C51 హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం ఫోన్‌గా విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా C61 స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. బ్లాక్‌, బ్లూ, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

Poco C61 Smartphone launch in india on march 26

అయితే ఈ పోకో C61 స్మార్ట్‌ఫోన్‌ మార్చి 26వ తేదీన భారత్‌లో విడుదల కానుందని X పోస్ట్‌ ద్వారా సంస్థ ధ్రువీకరించింది. ఈ హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్‌ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.7499 గా ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే లీక్‌ అయిన వివరాలు ఆధారంగా పోకో C61 స్మార్ట్‌ఫోన్‌ సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు సన్నది బెజెల్స్‌ కలిగి ఉంటాయని తెలుస్తోంది. దీంతోపాటు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.71 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది.

Poco C61 Smartphone launch in india on march 26

దీంతోపాటు పోకో కొత్త ఎంట్రీ లెవల్‌ హ్యాండ్‌సెట్‌ C61... మీడియాటెక్‌ హీలియో G36 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ USB-C ఛార్జింగ్‌ పోర్టు, 10W వైరడ్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. 8MP ప్రైమరీ కెమెరా, 0.08 సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను ‌అమర్చి ఉంటుందని తెలుస్తోంది.

Poco C61 Smartphone launch in india on march 26

ఈ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. 4GB ర్యామ్‌ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌, 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7499 గా ఉంటుందని తెలుస్తోంది.

ఈ పోకో C61 స్మార్ట్‌ ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌ కార్డులను సపోర్టు చేస్తుంది. మరియు మైక్రో SD కార్డు స్లాట్‌ను కలిగి ఉంటుంది. 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco C61 Smartphone confimed to launch on march 26 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X