Home
Mobile

ధర రూ.6,799కే 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌..!!

పోకో నుంచి ఇటీవల పోకో C65 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco C65 Smartphone) లాంచ్‌ అయింది. బడ్జె్ట్‌ ధర సెగ్మెంట్‌లో అందుబాటులో వచ్చింది. ప్రస్తుతం మరింత తగ్గింపు ధరకే అందుబాటులోకి వస్తోంది. హీలియో G85 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌ విడుదల సమయంలో రూ.10,999 గా ఉంది. ప్రస్తుతం 38 శాతం తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్‌ ద్వారా మరింత తగ్గింపునకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌ సెట్ మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది.

Poco C65 5G smartphone

పోకో C65 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు..
ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌ 6.74 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌ సహా 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 83.7 స్క్రీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉంటుంది. మరియు 260ppi డెన్సిటీని కలిగి ఉంది. దీంతోపాటు డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ రక్షణ పొందుతుంది.

ఈ పోకో C65 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G85 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 14 OS ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్‌ మరియు 256GB ఇంటర్నల్‌ స్టోరేజీ ను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు.

Poco C65 5G smartphone

కెమెరా పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, AI లెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరా ఆప్షన్‌తో వచ్చింది.

ఈ హ్యాండ్‌సెట్‌ 4GB, 6GB, 8GB ర్యామ్‌ మరియు 128GB, 256 అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.6,799 మరియు 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.7,499, 8GB ర్యా్మ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,249 గా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 18W వైర్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా వైఫై 802.11, బ్లూటూత్ 5.3, A2DP, LE, GPS, GLONASS, USB-C ఛార్జింగ్ పోర్టు, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు యాక్సిలరోమీటర్‌, కంపాస్‌ సహా ఇతర సెన్సార్లు ఉన్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco C65 5G smartphone attract with massive discount in flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X