ధర రూ.6799 కే 128GB స్టోరేజీ, 50MP కెమెరా స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ పూర్తి వివరాలు..!!
ఫ్లిప్‌కార్ట్ లో పోకో స్మార్ట్‌ఫోన్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. పోకో C65 హ్యాండ్‌సెట్ ను (Poco C65 Smartphone Price) విడుదల ధరతో పోలిస్తే ఏకంగా 38 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్ సెట్ 5000mAh బ్యాటరీ సహా 50MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్ ను కలిగి ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ లో పోకో C65 స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను కేవలం రూ.6799 కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ధర ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందో వెల్లడి కాలేదు. ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

పోకో C65 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
పోకో C65 స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1650*720 పిక్సల్ రిజల్యూషన్ సహా 90Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను పొందుతుంది.
ఈ పోకో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. Mali G52 MC2 GPU చిప్‌తో జతచేయబడి ఉంది. మరియు ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS ను కలిగి ఉంది. 4GB ర్యామ్ +128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
50MP ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా సహా AI లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ పోకో C65 స్మార్ట్ ఫోన్ 4G LTE, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, USB-C, GPS వంటి అనేక కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 2G, 3G, 4G, 4G VOLTE నెట్‌వర్క్‌లను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ డెడికేటెడ్ స్లాట్‌ను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications