రూ.7000 ధరలో 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 OS ఫోన్..!
పోకో నుంచి భారత్ మార్కెట్‌లోకి మరో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. సోషల్ మీడియా ద్వారా పోకో C71 విడుదల తేదీని సంస్థ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ సహా మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్‌లను పోకో విడుదల చేసింది. ఇప్పటికే ఎంట్రీ లెవల్‌లో బెస్ట్ ఫోన్‌లను కలిగి ఉన్న పోకో.. ఇదే ధరలో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది.
పోకో గత సంవత్సరం పోకో C61 స్మార్ట్‌ఫోన్ ను (Poco C71 Smartphone Launch Date in india) లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా C71 లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్టు. కెమెరా వివరాలు వెల్లడయ్యాయి. రూ.7000 వేల ధరలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

ఎప్పుడు విడుదల కానుంది? :
పోకో వెల్లడించిన వివరాల ఆధారంగా పోకో C71 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రూ.7000 ధరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
డిస్‌ప్లే వివరాలు :
పోకో C71 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుంది. ఈ డిస్‌ప్లే వెట్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్ ను వినియోగించుకోవచ్చు. మరియు ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హాని కలగకుండా TUV Low Blue Light, ఫ్లిక్కర్ ఫ్రీ, కార్కార్డిన్ డిస్‌ప్లే మోడ్స్‌ను కలిగి ఉంటాయి.

ఈ పోకో కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆధారిత OS ను కలిగి ఉంటుంది. మరియు ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని పోకో తెలిపింది. ఈ చిప్‌సెట్ 6GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. మరియు 2TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 32MP ప్రైమరీ కెమెరా సహా మరో సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా యూనిట్ అనేక ఫిల్మ్ ఫిల్టర్స్‌ను కలిగి ఉంటాయి.
Enroute Blockbuster Beginnings ✨
— POCO India (@IndiaPOCO) March 31, 2025
Launching on 4th April on #Flipkart
Know More: https://t.co/o3TCULUAbm#POCOC71 #TheUltimateBlockBuster pic.twitter.com/lmv9lgl7w5
బ్యాటరీ వివరాలు :
ఎంట్రీ లెవల్ ధరలో పోకో C71 స్మార్ట్‌ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. ఈ రిటైల్ బాక్స్‌లోనే ఛార్జర్‌ను కూడా అందిస్తున్నారు. మూడు సంవత్సరాల తర్వాత కూడా ఈ బ్యాటరీ పనితీరు మెరుగ్గానే ఉంటుందని పోకో చెబుతోంది.
కలర్ వేరియంట్స్ :
ఈ ఫోన్ మూడు రంగుల్లో లభిస్తుంది. డిజర్ట్ గోల్డ్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








