Home
Mobile

రూ.7000 ధరలో 6.88 అంగుళాల డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ ఫోన్‌.. నేడే విడుదల..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో నుంచి ఇవాళ పోకో C71 స్మార్ట్‌ ఫోన్‌ (Poco C71 Smartphone) లాంచ్ కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌ లో లాంచ్ కానుంది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ రూ.7000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ లైవ్‌ పేజీ ద్వారా ఈ ఫోన్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది.

పోకో గత సంవత్సరం పోకో C61 హ్యాండ్‌సెట్‌ ను లాంచ్‌ చేసింది. ఇవాళ విడుదల కానున్న హ్యాండ్‌సెట్ C71 తర్వాత తరం వెర్షన్‌ గా ఈ ఫోన్‌ విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే పోకో అనేక ధర సెగ్మెంట్స్‌లో ఫోన్‌లను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ కు సంబంధించిన డిజైన్ సహా అనేక ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి.

poco C71 Smartphone launching today in india

గ్రిడ్‌ డిజైన్, భారీ డిస్‌ప్లే :
పోకో C71 స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం స్ప్లిట్‌ ‌గ్రిడ్‌ డిజైన్‌ తో లాంచ్ కానుంది. మరియు 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఎక్కువ సమయం ఉపయోగించినా కళ్లకు హాని జరగకుండా ఉండేలా TUV Low Blue Light, ఫ్లిక్కర్‌ ఫ్రీ, కార్కార్డిన్‌ డిస్‌ప్లే మోడ్స్‌ ను కలిగి ఉన్నాయి.

వెట్‌ టచ్ ఫీచర్‌ :
ఈ ఫోన్ డిస్‌ప్లే వెట్‌ టచ్ ఫిచర్‌ ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ ను వినియోగించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ డిజర్ట్‌ గోల్డ్‌, కూల్‌ బ్లూ, పవర్‌ బ్లాక్‌ వంటి మూడు రంగుల్లో లభిస్తుంది. మరియు ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ :
ఈ పోకో C71 హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS తో లాంచ్ కానుంది. మరియు ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ 6GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ 2 సంవత్సరాల OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది. మరియు 2TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా పోకో ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా 32MP ప్రైమరీ కెమెరా, మరో సెకండరీ కెమెరాలను కలిగి ఉంటుంది. దీని వివరాలు తెలియాల్సి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు ఫిల్మ్‌ ఫిల్టర్స్‌ను కలిగి ఉంటాయి.

5200mAh బ్యాటరీ :
పోకో C71 స్మార్ట్‌ఫోన్‌ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. మూడు సంవత్సరాల వరకు బ్యాటరీ మెరుగైన పనితీరు అందిస్తుందని పోకో తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
poco C71 Smartphone launching today in india with 5200mAh Battery and 6.88 inch large display
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X