రూ.6999 ధరకే 6GB ర్యామ్, 128GB స్టోరేజీ, 5200mAh బ్యాటరీ, 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే ఫోన్..!
Poco C71 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో ఈ ఏప్రిల్‌లో పోకో C71 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రూ.7000 కంటే తక్కువ ధరకు ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఫలితంగా ఎంట్రీ లెవల్ మోడల్‌లో ఫోన్‌లు కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ వంటి అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.
పోకో C71 స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.6,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 4GB ర్యామ్ వేరియంట్‌ను రూ.6399, 6GB ర్యామ్ వేరియంట్‌ను రూ.6999 కే కొనుగోలు చేయవచ్చు.

ఈ బ్యాంకు కార్డులపై 5 శాతం అదనపు డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ పోకో స్మార్ట్‌ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్, డిజర్ట్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.
పోకో C71 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
పోకో C71 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే వెట్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఉపయోగించుకోవచ్చు.
ఈ డిస్‌ప్లే Low Blue Light, ఫ్లిక్కర్ ఫ్రీ, TUV Rheinland eye ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ పోకో ఫోన్ IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ డ్యూయల్ టోన్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది.

4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
పోకో C71 స్మార్ట్‌ఫోన్ Unisoc T7250 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని పోకో తెలిపింది. దీంతోపాటు వర్చువల్ ర్యామ్ ద్వారా అదనపు ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం కూడా ఉంది.
5200mAh బ్యాటరీ :
పోకో స్మార్ట్‌ఫోన్ 15W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 32MP ప్రైమరీ కెమెరా, మరో లెన్స్‌ను అమర్చారు. మరియు 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ :
పోకో C71 స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 4G VoLTE, బ్లూటూత్, WiFi, GPS, FM రేడియో, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








