Home
Mobile

రూ.6499 కే ఏకంగా 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌.. సేల్‌ ఎప్పటి నుంచంటే?

పోకో నుంచి నిన్న (మార్చి 4) ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ఆకట్టుకొనే డిజైన్‌తో పోకో C71 స్మార్ట్‌ఫోన్‌ (Poco C71 Smartphone) అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.7,000 వేల ధరలో స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 6.88 అంగుళాల డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. విడుదల సమయంలో ఈ ఫోన్‌ సేల్‌ వివరాలను కూడా పోకో వెల్లడించింది.

ఎయిర్‌టెల్‌ యూజర్‌లకు ఆఫర్‌ :
ఎయిర్‌టెల్‌ సేల్‌లో భాగంగా హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయడం సహా 50GB డేటాను అదనంగా పొందవచ్చు. ఈ పోకో ఫోన్‌ కూల్‌ బ్లూ, పవర్‌ బ్లాక్‌, డిజర్ట్‌ గోల్డ్‌ రంగుల్లో భారత్ మార్కెట్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి వివరాలు.

Poco C71 Smartphone

డిస్‌ప్లే వివరాలు :
పోకో C71 హ్యాండ్‌సెట్ 6.88 అంగుళాల HD+ (720*1640 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే సర్కాడియన్‌, లోబ్లూ లైట్‌, ఫ్లిక్కర్‌ ఫ్రీ వంటి TUV Rheinland eye ప్రొటెక్షన్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

ప్రాసెసర్ :
ఈ పోకో ఫోన్‌ Unisoc T7250 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ వర్చువల్‌ ర్యామ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. దీని ద్వారా 12GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు.

OS, బ్యాటరీ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందించనుంది. పోకో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ 15W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా పోకో హ్యాండ్‌సెట్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 32MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు.

ఈ ఫోన్‌ బ్యాక్ ప్యానల్‌ స్ల్పిట్ గ్లిడ్‌ డిజైన్‌తో కూడిన డ్యూయల్‌ టోన్ ఫినిష్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే వెట్‌ టచ్‌ సపోర్టును కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

కనెక్టివిటీ పరంగా 4G VoLTE, బ్లూటూత్‌ డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, GPS, FM రేడియో, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చి ఉంది.

ధర, సేల్‌ వివరాలు :
పోకో C71 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,499 గా ఉంది. అదే 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.7,499 గా ఉంది. ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఏప్రిల్‌ 8 వ తేదీ నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది.

పోకో మరో కొత్త ఆఫర్‌ వివరాలను కూడా వెల్లడించింది. ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ యూజర్లు ఈ పోకో C71 హ్యాండ్‌సెట్‌ను రూ.5999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ ప్రకటన చేసింది. ఎయిర్‌టెల్‌ యూజర్లకు ప్రత్యేక సేల్‌ ఏప్రిల్‌ 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco C71 Smartphone with 6.88 inch display sale to start from april 8 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X