రూ.6399 కే 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ ఫినిష్‌తో స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో ఈ సంవత్సరం మార్చి నెలలో పోకో C71 స్మార్ట్‌ఫోన్ ( Poco C71 Smartphone ) విడుదల అయింది. ఈ ఫోన్ కేవలం రూ.7 వేల కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ హ్యాండ్‌సెట్ 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 5200mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
రూ.6399 కే కొనుగోలు చేయవచ్చు :
పోకో C71 స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.6,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.6399 గా ఉంది. ఈ ఫోన్ కూల్ బ్లూ, డిజర్ట్ గోల్డ్, పవర్ బ్లాక్ వంటి మూడు కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది.

భారీ డిస్‌ప్లే :
పోకో C71 స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 720 x 1640 పిక్సల్స్, 120Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. మరియు TUV Rheinland eye ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది.
ఆకట్టుకొనే డిజైన్ :
ఈ డిస్‌ప్లే వెట్ టచ్ ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఫోన్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ స్ప్లిట్ గ్లి్డ్ డిజైన్ తో కూడిన డ్యూయల్ టోన్ ఫినిష్ ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఆకట్టుకొనేలా ఉంటుంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ పోకో హ్యాండ్‌సెట్ Unisoc T7250 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.

ఎంట్రీ లెవర్ ధరలో భారీ బ్యాటరీ, 32MP కెెమెరా :
ఈ పోకో C71 స్మార్ట్‌ఫోన్ 15W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 32MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను అమర్చారు. అదే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ పోకో C71 హ్యాండ్‌సెట్ 4G VoLTE, బ్లూటూత్, WiFi, GPS, FM రేడియో, USB -C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP52 రేటింగ్ తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చి ఉంది.


Click it and Unblock the Notifications








