Home
Mobile

రూ.7,999 కే 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే. 5160mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు..!

పోకో భారత్‌ మార్కెట్‌లో గత సంవత్సరం డిసెంబర్‌లో ఎంట్రీ లెవల్ ధరలో పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వినియోగించే వారికి ఈ ఫోన్‌ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ హ్యాండ్‌సెట్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.8000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

ధర, కలర్ వేరియంట్స్‌ :
భారత్ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ (Poco C75 5G Smartphone) కేవలం 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ ధర రూ.7999 గా ఉంది. ఫ్లి్ప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంక్ క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. సిల్వర్‌ స్టార్ డస్ట్‌, ఆక్వా బ్లిస్‌, ఎన్‌ఛాంటెడ్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

Poco C75 5G Smartphone

పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
ఈ పోకో ఎంట్రీ లెవల్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల (720*1600 పిక్సల్స్‌) HD+ భారీ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా చూసేవారికి ఈ డిస్‌ప్లే అనుకూలంగా ఉంటుంది.

OS, చిప్‌సెట్ :
పోకో 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌ 4GB ర్యామ్, 64GB స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. రెండు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్లతోపాటు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని పోకో వెల్లడించింది. అంటే 4 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త అప్‌డేట్స్‌తో ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.

Poco C75 5G Smartphone

కెమెరా, బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగాను ఈ ధరలో మెరుగైన ఫీచర్‌లనే కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో లెన్స్‌ను అమర్చారు. మరియు 5MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ధరలో మెరుగైన బ్యాటరీని కలిగి ఉంది. 18W ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. సుమారుగా ఒక రోజంతా బ్యాటరీ లైఫ్‌ వచ్చే అవకాశం ఉంది.

ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ :
కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్‌ 5.3, GPS, GLONASS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రిసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకొనేవారికి ఈ హ్యాండ్‌సెట్ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది. ధరతోపాటు భారీ డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరాల పనితీరు కూడా ఆకట్టుకుంటుంది. దీంతోపాటు డిజైన్‌ కూడా బడ్జెట్‌ రేంజ్‌ హ్యాండ్‌సెట్‌ తరహా లుక్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Poco C75 5G Smartphone available at RS7999 on flipkart check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X