Home
Mobile

ధర రూ.7999 కే 5G స్మార్ట్‌ఫోన్‌.. 50MP కెమెరా, 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే సహా కీలక ఫీచర్‌లు..!

భారత్‌ మార్కెట్‌లోకి పోకో C75 5G, పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. పోకో C75 స్మార్ట్‌ఫోన్‌ రూ.7999 ధరకే (Poco C75 5G Smartphone Launched) అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి వచ్చినట్లయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP కెమెరా సహా భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు డిజైన్‌ ఆకట్టుకుంటోంది. అయితే ఒకే వేరియంట్లో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పిసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Poco C75 5G Smartphone) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 720*1600 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

Poco C75 5G Smartphone sale

ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS స్కిన్‌ తో పనిచేస్తుంది. కేవలం 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

50MP కెమెరా + 5160mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 18W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Poco C75 5G Smartphone sale

ఈ హ్యాండ్‌సెట్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ప్లాష్‌ రెసిస్టెన్స్‌తో అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, బ్లూటూత్‌ 5.3, వైఫై, GPS, GLONASS, 3.5mm ఆడియో జాక్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,999 గా ఉంది. అయితే కేవలం ప్రారంభ ఆఫర్‌లో భాగంగా మాత్రమే ఈ ధరకు హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చని పోకో తెలిపింది. ఆఫర్‌ పిరియడ్‌ అనంతరం ఈ హ్యాండ్‌సెట్ ధర పెరిగే అవకాశం ఉంది. సిల్వర్ స్టార్‌ డస్ట్‌, ఆక్వా బ్లూ, ఎన్‌ఛాంటెడ్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. ఫ్లి్‌ప్‌కార్ట్‌ ద్వారా డిసెంబర్‌ 19 వ తేదీ మధ్యా్హ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది.

పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC చిప్‌సెట్, 50MP ప్రైమరీ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5110mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.14999 గా ఉంది. మరో వేరియంట్ ధర రూ.16999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco C75 5G Smartphone launched with 50MP camera and 6.88 inch display in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X