ధర రూ.7999 కే 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ, 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లే 5G ఫోన్..!
పోకో నుంచి భారత్ మార్కెట్‌లోకి రెండు రోజుల క్రితం ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.7999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ (Poco C75 5G Smartphone Sale) తాజాగా ప్రారంభం అయింది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఎంట్రీ లెవల్‌లో అందుబాటులోకి వచ్చినా.. మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.
పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.7999 కే కొనుగోలు చేయవచ్చు. ఆక్వా బ్లూ, సిల్వర్ స్టార్ డస్ట్, ఎన్‌ఛాంటెడ్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంది. అయితే ప్రారంభ ఆఫర్‌లో భాగంగానే ఈ ధరకు ఫోన్‌ను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 720*1600 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
ఈ ఎంట్రీ లెవల్ పోకో 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS (Skin) తో పనిచేస్తుంది. మరియు ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB ర్యామ్, 64GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఒకే స్టోరేజీ వేరియంట్‌లో భారత్ మార్కెట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా సహా మరో సెకండరీ కెమెరాను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అయితే బ్యాటరీ విషయానికి వస్తే తక్కువ ధరలోనూ భారీ బ్యాటరీతోనే విడుదల అయింది. ఈ ఫోన్ 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. 18W ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.3, WiFi, GPS, GLONASS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ఈ పోకో ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. మరియు IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్‌తోపాటు బడ్జెట్ రేంజ్‌లో పోకో M7 ప్రో 5G హ్యండ్‌సెట్ విడుదల అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. 50MP సోనీ LYT-600 కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.


Click it and Unblock the Notifications








