రూ.10 వేల కంటే తక్కువ ధరలో భారీ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5160mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్
భారత్ మార్కెట్ లో బడ్జెట్ ధరలో అనేక 5G స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరిలో పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ సుమారు రూ.20 వేల ధరకు అందుబాటులో వచ్చింది. అయితే పోకో భారత్ మార్కెట్‌లో అనేక మోడల్స్‌ను తీసుకొచ్చింది. గత సంవత్సరం విడుదల అయిన పోకో C75 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులో ఉంది. ఈ ధరలో 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్, 50MP కెమెరాలను కలిగి ఉంది.
పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ (Poco C75 5G Smartphone) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.

పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
స్నాప్‌డ్రాగన్ చిప్, 50MP కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ ప్రైమరీ కెమెరా, మరో కెమెరా ఉంది. ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ IP52 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. 5G (జియో మాత్రమే), 4G, బ్లూటూత్ 5.3, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఈ ఫోన్ ఆక్వా బ్లూ, ఎన్‌ఛాంటెడ్ గ్రీన్, సిల్వర్ స్టార్ డస్ట్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ సంవత్సరం జనవరిలో లాంచ్ అయిన పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.21999 గా ఉంది. 6.77 అంగుళాల 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. MIL STD 810 మిలిటరీ గ్రేడ్, SGS సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తోంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలున్నాయి. 20MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తాయి. 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీతో పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications








