రూ.7499 ధరకే భారీ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్.. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 5160mAh బ్యాటరీ, 50MP కెమెరా సహా..!
భారత్ మార్కెట్ లో ప్రస్తుతం రూ.8 వేల కంటే తక్కువ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఈ ధరలో అనేక మోడల్స్ ను లాంచ్ చేశాయి. ఈ ధరలో అందుబాటులోకి వచ్చిన పోకో C75 హ్యాండ్‌సెట్ ను డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది.
విడుదల సమయంలో పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ (Poco C75 Smartphone) 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ రూ.7999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7499 కే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.8,299 గా ఉంది.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.88 అంగుళాల HD+ (720 x 1600 పిక్సల్స్) భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సిల్వర్ స్టార్ డస్ట్, ఎన్‌ఛాంటెడ్ గ్రీన్ కలర్, ఆక్వా బ్లూ కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది.
స్నాప్‌డ్రాగన్ :
పోకో ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్, 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, మరో సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్, స్ల్పా్ష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.
పోకో M7 ప్లస్ 5G ఫోన్ :
ఈ సంవత్సరం ఆగస్టులో పోకో M7 ప్లస్ 5G ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.9 అంగుళాల డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 పైన పనిచేస్తోంది.
ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ పోకో M7 ప్లస్ హ్యాండ్‌సెట్ 50MP కెమెరాతో అందుబాటులో ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చి ఉంది.


Click it and Unblock the Notifications