పోకో నుంచి C సిరీస్ స్మార్ట్‌ఫోన్ తాజాగా కీలక వివరాలు లీక్..!
Poco C85 5G Smartphone : పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఇటీవలే ఈ ఫోన్ వివరాలను వెల్లడించింది. ఈ టీజర్ ద్వారా ఈ ఫోన్ అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ పోకో ఫోన్ విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, విడుదల వివరాలు.
కెమెరా మాడ్యూల్ :
పోకో తన X హ్యాండిల్ ద్వారా టీజర్‌ను షేర్ చేసింది. దీని ఆధారంగా ఈ ఫోన్ స్క్వేర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ పర్పుల్ కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది.

50MP కెమెరా :
పోకో అందించిన వివరాల ఆధారంగా పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP AI కెమెరాను కలిగి ఉంటుంది. మిగిలిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఇటీవలే ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లో లిస్టింగ్ అయింది. 2508CPC2BI మోడల్ నంబర్‌తో కనిపించింది.
ఫ్లాట్ డిస్‌ప్లే :
గూగుల్ ప్లే కన్సోల్ వివరాల ఆధారంగా పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ స్లిమ్ బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ముందువైపు వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్ ఉంటుంది. ఫోన్ కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్‌లను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్? :
పోకో C85 5G ఫోన్.. రెడ్‌మి 15c 5G ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉంటుందని తెలుస్తోంది. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రీబ్రాండెడ్ వెర్షన్‌గా అందుబాటులోకి వస్తే మాత్రం.. పోకో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ :
పోకో నుంచి ఇటీవల పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.13,999 గా ఉంది.
పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీను కలిగి ఉంది. దీంతోపాటు 18W రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా ఉంది. మరో సెకండరీ కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.


Click it and Unblock the Notifications








