రూ.11999 ధరకే 6000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే ఫోన్!
Poco C85 5G Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో ఇటీవల భారత్ మార్కెట్ లో పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో ఈ హ్యాండ్‌సెట్ ను తీసుకొచ్చింది. ఈ పోకో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ పోకో C85 స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి భారత్ మార్కెట్ లో ప్రారంభం కానుంది.
రూ.11999 ధరకే :
భారత్ మార్కెట్ లో పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499 గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ఫోన్ మొత్తంగా పవర్ బ్లాక్, స్ప్రింగ్ గ్రీన్, మిస్టిక్ పర్పుల్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ టోన్ ఫినిష్‌తో కూడిన క్వాడ్ కర్వడ్ డిజైన్ ను కలిగి ఉంది.
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. TUV ఫ్లిక్కర్ ఫ్రీ, TUV Low Blue లైట్, TUV సర్కాడియన్ సర్టిఫికేషన్లను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
50MP AI కెమెరా :
కెమెరా విభాగం పరంగా పోకో C85 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP AI ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. అయితే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను పొందుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని పోకో తెలిపింది.
6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతోపాటు రివర్స్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. 28 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని పోకో చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా పోకో ఫోన్ 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అమర్చారు.


Click it and Unblock the Notifications








