రూ.12 వేల ధరలో 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే 5G ఫోన్!
భారత్ మార్కెట్ లో పోకో సంస్థ ఇటీవల C85x 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. రూ.10999 ప్రారంభ ధరకు అందుబాటులోకి వచ్చింది. 6.9 అంగుళాల భారీ బ్యాటరీ, 6300mAh బ్యాటరీ, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అయితే గత సంవత్సరం డిసెంబర్ లో లాంచ్ అయిన పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ ను ( Poco C85 5G Smartphone ) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
రూ.11999 ప్రారంభ ధరకు :
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ( Flipkart ) కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499 గా ఉంది.

డ్యూయల్ టోన్ ఫినిష్ :
ఫ్లిప్‌కార్ట్ లో (Flipkart) ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ లను పొందవచ్చు. ఈ పోకో ఫోన్ మిస్టిక్ పర్పుల్, స్ప్రింగ్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిష్ తో క్వాడ్ కర్వడ్ డిజైన్ ను కలిగి ఉంది.
భారీ డిస్‌ప్లే, IP64 రేటింగ్ :
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 7.99mm థిక్‌నెస్‌తో 211 గ్రాముల బరువును కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఉంది.
6000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. ఈ ఫాస్ట్ ఛార్జర్ తో కేవలం 28 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ ను పూర్తి చేస్తుందని విడుదల సమయంలో పోకో తెలిపింది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP AI కెమెరా, LED ఫ్లాష్ లైట్ ను కలిగి ఉంది. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








