రూ.11999 ధరకే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్ చిప్‌సెట్ తో ఫోన్!
Poco C85 5G Smartphone Sale : పోకో సంస్థ భారత్ మార్కెట్‌లో ఇటీవల పోకో C85 5G స్మా్ర్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50MP కెమెరాలను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ సేల్ డిసెంబర్ 16 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు, ధర పూర్తి వివరాలు.
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ సేల్, ధర :
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ సేల్ డిసెంబర్ 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ పవర్ బ్లాక్, స్ప్రింగ్ గ్రీన్, మిస్టిక్ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499 గా ఉంది.
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ పోకో ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిష్‌తో కూడిన క్వాడ్ కర్వడ్ డిజైన్‌ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు TUV Low Blue లైట్, TUV ఫ్లిక్కర్ ఫ్రీ, TUV సర్కాడియన్ సర్టిఫికేషన్లను కలిగి ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని పోకో హామీ ఇచ్చింది.
50MP కెమెరా, LED ఫ్లాష్ లైట్ :
కెమెరా విభాగం పరంగా పోకో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అయితే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్‌ను కూడా కలిగి ఉంది.
28 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ :
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 10W రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. కేవలం 28 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని పోకో చెబుతోంది.
ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 7.99mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. 211 గ్రాముల బరువుతో అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








