Home
Mobile

రూ.10999 ధరకు 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 6300mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో భారత్‌ మార్కెట్లో C సిరీస్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గత డిసెంబర్‌లో పోకో C85 5G ఫోన్‌ విడుదల కాగా.. తాజాగా పోకో C85x 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ భారీ డిస్‌ప్లే, రివర్స్‌ ఛార్జింగ్, 6300mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

పోకో C85x 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ (Poco C85x 5G Smartphone) 6.9 అంగుళాల HD+ AdaptiveSync డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే ఫ్లిక్కర్‌ ఫ్రీ, Low Blue Light, TUV Rheinland సర్కాడియన్‌ సర్టిఫికేషన్లు ఉన్నాయి.

Poco C85x 5G smartphone price and sale

2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు :
పోకో C85x 5G స్మార్ట్‌ఫోన్ Unisoc T8300 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు Mail G57 GPU ను కూడా అమర్చారు. ఈ ప్రాసెసర్‌ 4GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

10x డిజిటల్‌ జూమ్, రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 10x డిజిటల్‌ జూమ్‌తో 32MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు మరో సెకండరీ లెన్స్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరా ఉంది. 15W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6300mAh బ్యాటరీని కలిగి ఉంది. 7.5W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

Poco C85x 5G smartphone price and sale

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 5, 3.5mm ఆడియో జాక్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఇ-కంపాస్‌, యాంబియంట్‌ లైట్ సెన్సర్‌, యాక్సెలిరోమీటర్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌ ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

ఈ ఫోన్‌ IP57 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. గ్రీన్, గోల్డ్‌, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. జెమిని ఏఐ, సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Poco C85x 5G smartphone price and sale

పోకో C85x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ :
ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. మార్చి 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు.

పోకో నుంచి M8 5G స్మార్ట్‌ఫోన్‌ ఈ జనవరిలో విడుదల అయింది. మార్చి 17 వ తేదీన పోకో X8 ప్రో సిరీస్ విడుదల కానుంది. ఇందులో భాగంగా పోకో X8 ప్రో, X8 ప్రో మ్యాక్స్ ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్‌లు మీడియాటెక్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయి. భారీ బ్యాటరీతో విడుదల కానున్నాయని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco C85x 5G smartphone with 6300mAh Battery launched in india features, price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X