Home
Mobile

రూ.10999 ధరకు 6300mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 16 OS ఫోన్‌.. ఇవాళ్టి నుంచే సేల్‌..!

పోకో సంస్థ నుంచి మార్చి 17 వ తేదీన పోకో X8 ప్రో సిరీస్ విడుదల కానుంది. ఈ సిరీస్‌ లో భాగంగా X8 ప్రో, X8 ప్రో మ్యాక్స్‌ మోడల్స్ లాంచ్‌ కానున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. మ్యాక్స్ మోడల్ ఏకంగా 9000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

రూ.10999 ప్రారంభ ధర :
ఇటీవల విడుదల అయితే పోకో C85x 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco C85x 5G Smartphone Sale) సేల్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్డ్‌ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.10999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999 గా ఉంది.

Poco C85x 5G Smartphone sale

భారీ డిస్‌ప్లే :
పోకో C85x 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.9 అంగుళాల HD+ భారీ AdaptiveSync డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఆ డిస్‌ప్లే TUV Rheinland సర్టిఫికేషన్‌ లు ఉన్నాయి.

ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS :
ఈ హ్యాండ్‌సెట్‌ Unisoc T8300 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. Mail G57 GPU ను కూడా కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 4GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని తెలుస్తోంది.

Poco C85x 5G Smartphone sale

2TB వరకు స్టోరేజీ :
ఈ ఫోన్ ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులోకి వచ్చింది. అయితే మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. జెమిని ఏఐ, సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ IP57 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

6300mAh బ్యాటరీ :
పోకో C85x 5G స్మార్ట్‌ఫోన్ 6300mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 15W వైర్‌ ఛార్జింగ్‌, 7.5W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. 10x డిజిటల్‌ జూమ్‌ తో 32MP కెమెరా, మరో లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ గ్రీన్, గోల్డ్‌, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్‌ 5.4, 3.5mm ఆడియో జాక్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు యాక్సెలిరోమీటర్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌, ఇ-కంపాస్‌, యాంబియంట్‌ లైట్ సెన్సర్‌ ఉన్నాయి. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco C85x 5G Smartphone with 6300mAh battery sale to start from today via Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X