ఓపెన్ సేల్ పై Poco F1, 6జీబి ర్యామ్ వెర్షన్ ధర రూ.20,999

షియోమి సబ్సిడరి బ్రాండ్ పోకో (Poco) నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన పోకో ఎఫ్1 (Poco F1) ఫోన్ ఇంటర్నెట్‌లో ఎంతటి వైరల్ అయ్యిందో మనందరికి తెలుసు. మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి ఫ్లాష్ సేల్ ప

|

షియోమి సబ్సిడరి బ్రాండ్ పోకో (Poco) నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన పోకో ఎఫ్1 (Poco F1) ఫోన్ ఇంటర్నెట్‌లో ఎంతటి వైరల్ అయ్యిందో మనందరికి తెలుసు. మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి ఫ్లాష్ సేల్ పై లభ్యమవుతూ వస్తోన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హై-ఎండ్ ఫోన్ ఇప్పుడు ఓపెన్ సేల్ పై లభ్యమవుతోంది. Mi.com అలానే ఫ్లిప్‌కార్ట్‌లలో సెప్టంబర్ 14 అర్థరాత్రి నుంచి ఓపెన్ సేల్ ప్రారంభమయ్యింది.

 

త్వరలోనే మిగిలిన రెండు వేరియంట్స్ కూడా..

త్వరలోనే మిగిలిన రెండు వేరియంట్స్ కూడా..

ఈ ఓపెన్ సేల్‌లో భాగంగా 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తోన్న పోకో ఎఫ్1 వేరియంట్‌ను మాత్రమే పోకో అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ రోసో గోల్డ్, స్టీల్ బ్లూ ఇంకా గ్రాఫైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లకు సంబంధించి మిగిలిన రెండు మోడల్స్ అయిన 6జీబి ర్యామ్ + 64జీబి, 8జీబి ర్యామ్ + 256జీబి స్టోరేజ్ మోడల్స్ కూడా త్వరలోనే ఓపెన్ సేల్ పై లభ్యమవుతాయిని పోకోఇండియా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

 

 

ధరల వివరాలు....

ధరల వివరాలు....

ఇండియన్ మార్కెట్లో పోకో ఎఫ్1 మూడు రకాల వేరియంట్‌లలో లభ్యమవుతోంది. అందులో మొదటి వేరియంట్ 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ సపోర్ట్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ సపోర్ట్‌తోనూ, మూడవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 256జీబి స్టోరేజ్ సపోర్ట్‌తోనూ లభ్యమవుతున్నాయి. వీటి ధరలు రూ.20,999, రూ.23,999, రూ.28,999గా ఉన్నాయి.

పోక్ ఎఫ్1 స్పెసిఫికేషన్స్...
 

పోక్ ఎఫ్1 స్పెసిఫికేషన్స్...

6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్ 18.7:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI కస్ట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రికగ్నిషన్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్రెయిట్ మోడ్ సపోర్ట్, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4.0 సపోర్ట్.

మొదటి సేల్‌లోనే రికార్డుల మోత..

మొదటి సేల్‌లోనే రికార్డుల మోత..

పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఆగష్టు 29న నిర్వహించిన మొదటి ఫ్లాష్ సేల్ సరికొత్త అమ్మకాల రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ సేల్ ప్రారంభమైన మొదటి 5 నిమిషాల్లోనే రూ.200 కోట్లు విలువ చేసే పోకో ఎఫ్1 యూనిట్లు అమ్ముడైనట్లు పోకో ఇండియా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ చరిత్రలోనే ఇదో పెద్ద ఫ్లాష్‌సేల్‌గా నిలిచి పోతుందని పోకో ఇండియా తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా ఎన్ని ఫోన్ లు అమ్ముడయ్యాయన్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించింది.

Best Mobiles in India

English summary
Poco F1 6GB RAM, 128GB Storage Variant Now Available on Open Sale.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X