Poco F1 పై 70% బైబ్యాక్, త్వరపడండి..
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ షియోమి పోకో ఎఫ్1 కొనుగోలు పై 70% బైబ్యాక్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ షియోమి పోకో ఎఫ్1 కొనుగోలు పై 70% బైబ్యాక్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ క్రింద షియోమి పోకో ఎఫ్1 ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లు, 8 నెలల తరువాత ఆ ఫోన్‌ను వేరొక పోకో ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే 70% బైబ్యాక్ (Buyback) వారికి లభిస్తుంది.

రూ.149 చెల్లించి పాలసీ తీసుకున్నట్లయితే..
మార్కెట్లో పోకో ఎఫ్1 ప్రారంభ వేరియంట్ ధర ర.20,999గా ఉంది. ఆన్‌గోయింగ్ బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో అదనంగా రూ.149 చెల్లించి బయ్‌బ్యాక్ గ్యారంటీ పాలసీని తీసుకోవల్సి ఉంటుంది. పాలసీని తీసుకోవటం ద్వారా ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే సమయంలో రూ.14,700 బైబ్యాక్ లభిస్తుంది.

నిబంధనలు ఇవే..
బయ్‌బ్యాక్ పాలసీకంటూ పలు ముఖ్యమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ పాలసీ క్రింద లభించే బయ్‌బ్యాక్ నాన్-ట్రాన్సఫరబుల్, వేరొక ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఈ పాలసీ క్రింద ఫోన్‌ను రిటర్న్ చేసే సమయంలో డివైస్ పూర్తి వర్కింగ్ కండీషన్‌లో ఉండాలి. ఫోన్ పై ఎక్కువ గీతలు ఉండకూడదు. ఇదే సమయంలో ఫోన్‌తో పాటుగా వచ్చే బాక్స్, ఛార్జర్ ఇంకా ఇతర యాక్సెసరీస్ కూడా రిటర్నల్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేయని పక్షంలో బయ్‌బ్యాక్ వాల్యూ తగ్గిపోతుంది.

Poco F1 స్పెసిఫికేషన్స్..
6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (2246×1080 పిక్సల్) విత్ 2.5డి గొరిల్లా గ్లాస్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పై), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

ధరల వివరాలు..
ధరలు విషయానికి వచ్చేసరికి పోకో ఎఫ్1 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.20,999గా ఉంది. 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ వెర్షన్ ధర రూ.23,999గా ఉంది. 8జీబి ర్యామ్ + 256జీబి స్టోరేజ్ వెర్షన్ ధర రూ.28999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








