Poco నుంచి రెండు 5G స్మార్ట్ ఫోన్లు విడుద‌ల‌.. ధ‌రలు ఎంతంటే!

|

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ Poco మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్ Poco F4 5G ను భార‌త‌ మార్కెట్లోకి విడుద‌ల చేసింది. అదేవిధంగా గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి Poco X4 GT 5G మ‌రో మోడ‌ల్ మొబైల్స్ ను విడుద‌ల చేసింది. ఈ రెండు మొబైల్స్ కూడా అద్భుత‌మైన స్పెసిఫికేష‌న్స్ క‌లిగి ఉన్నాయి. ప్ర‌స్తుతం Poco F4 5G మొబైల్స్ ర్యామ్‌, స్టోరేజీ ఆధారంగా మూడు వేరియంట్ల‌లో భార‌త మార్కెట్లో అందుబాటులో ఉన్న‌ట్లు కంపెనీ పేర్కొంది. అదే ఈ మేర‌కు కంపెనీ వ‌ర్గాలు ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాయి.

 
poco f4 launched

Poco F4 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..
ఈ మొబైల్ కు 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ను క‌లిగి ఉంది. ఇది 6GB/128GB, 8GB/128GB, 8GB/256GB, 12GB/256GB (RAM/Internal storage) వేరింయ‌ట్ల‌లో ల‌భిస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12ఓఎస్ (MIUI 13) పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. 64 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 20 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

 
poco f4 launched

Poco X4 GT 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల ఫుల్ HD+ LCD పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ను క‌లిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ ను అల్యూమినియం తో స్క్వేర్ షేప్‌లో రూపొందించారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12ఓఎస్ (MIUI custom OS) పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. 48 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఇది డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3 వ‌ర్శ‌న్‌, యూఎస్‌బీ సీ టైప్ పోర్ట్ ఫెసిలిటీస్ క‌లిగి ఉంది.

poco f4 launched

మొబైల్స్ ధ‌ర‌లు:
భార‌త్‌లో Poco F4 5G ధ‌రల్ని వేరియంట్ల వారీగా (6GB + 128GB) రూ.23,999, (8GB + 128GB) రూ.25,999, (12GB + 256GB) రూ.29,999 గా నిర్ణ‌యించారు. యూరోపియన్ మార్కెట్లో Poco X4 GT 5G (8GB + 128GB), ధ‌ర 379 యూరోలుగా ఉంది. భార‌త క‌రెన్సీ ప్ర‌కారం చూస్తే దీని ధ‌ర దాదాపు రూ.31,150 ఉండొచ్చ‌ని అంచ‌నా. Poco X4 GT 5G (8GB + 128GB), ధ‌ర రూ.35,300 ఉండొచ్చ‌ని అంచ‌నా.

Best Mobiles in India

English summary
Poco F4 5G launched in india and X4 GT 5G in global markets.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X