Just In
- 27 min ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 2 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 20 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 22 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
Don't Miss
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- News
magician: భార్యకు ఆరోగ్యం బాగాలేదని మాంత్రికుడి దగ్గరకు వెళ్లాడు, ఆంటీని వదిలేసి వాడు ఏం చేశాడు ?
- Sports
INDvsNZ : ఏదో అనుకుంటే ఇలా ఆడుతున్నాడు.. యంగ్ ఓపెనర్‌పై గంభీర్ ఫైర్!
- Finance
Nitin Gadkari: ఏప్రిల్ 1 నుంచి ఆ వాహనాలకు 'NO' ఎంట్రీ.. నితిన్ గడ్కరీకి మహీంద్రా థ్యాంక్స్..
- Movies
Intinti Gruhalakshmi Today Episode: తులసి ఫ్యామిలీకి జాక్‌పాట్.. అలా చేతికొచ్చిన విలువైన ఆస్తి
- Lifestyle
హైబ్లడ్ ప్రెజర్ ను తక్కువగా అంచానా వేయకండి..ఇది ఎలా ప్రాణం తీస్తుందో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Poco F4 స్మార్ట్‌ఫోన్‌పై Flipkart లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు!
ప్రముఖ ఈ కామర్స్ సైట్ Flipkart లో ఎలక్ట్రానిక్ సేల్ కొనసాగుతోంది. అందులో భాగంగా Poco కంపెనీకి చెందిన Poco F4 5జీ మొబైల్‌పై ఆకర్షణీయ డిస్కౌంట్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. Poco F4 ప్రారంభ ధర రూ.27,999 ఉండగా.. ప్రస్తుతం ఇది ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో భాగంగా రూ.22,999 లభించనుంది. ఈ Poco F4 5జీ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో కూడిన ఫీచర్లను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఎలక్ట్రానిక్ సేల్‌లో (జులై 14తేదీ నుంచి 17 వరకు) భాగంగా ఇంకా పలు ఉత్పత్తులపై మంచి డిస్కౌంట్లతో కూడిన ఆఫర్లను అందిస్తోంది. కాగా ఈ ఆఫర్‌కు సంబంధించిన విషయాన్ని Poco ఇండియా కంపెనీ తమ అధికారిక ఖాతా ద్వారా ప్రకటించింది.

భారత్‌లో Poco F4 ధర:
భారత మార్కెట్లో Poco F4 స్మార్ట్‌ఫోన్ (6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ) వేరియంట్ రూ.27,999 ప్రైస్ ట్యాగ్ కలిగి ఉంది. ఎస్‌బీఐ కార్డు దారులు దీనిపై రూ.2,250 డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా ఫ్లిప్‌కార్ట్ దాదాపు రూ.3000 కు పాత ఫోన్లపై ఎక్స్చేంజీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో వినియోగదారులు ఈ మొబైల్‌ను రూ.22,749 కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ఎస్‌బీఐ కార్డు యూజర్లు డైరెక్టుగా ఈఎంఐ ట్రాన్సాక్షన్ ఎంచుకోవడం ద్వారా రూ.3000 డిస్కౌంట్ తో రూ.24,999 పొందే అవకాశం కూడా ఉంటుంది.

Poco F4 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ స్మార్ట్‌ఫోన్ Snapdragon 870 SoC ప్రాసెసర్‌తో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ను కనబరుస్తుంది. దీనికి రెండు 5జీ సపోర్టెడ్ సిమ్ స్లాట్ ఫీచర్‌ను కల్పిస్తున్నారు. ఈ మొబైల్ కు 6.67 అంగుళాల ఫుల్ HD+AMOLD పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఇది 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ లిక్విడ్ కూల్ 2.0 టెక్నాలజీ తో తయారు చేశారు. ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 870 SoC ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 64 మెగాపిక్సల్ క్వాలిటీలో ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్సల్ క్వాలిటీతో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 20 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా పని చేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో భాగంగా Poco X4 Pro కూడా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. Poco X4 Pro (6GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజీ) వేరియంట్ సాధారణ ధర రూ.18,999.. కాగా ప్రస్తుతం ఇది ఆఫర్‌లో భాగంగా కొనుగోలు దారులకు రూ.15,999 కి అందుబాటులో ఉంది.
Poco X4 Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.67 అంగుళాల ఫుల్ HD+AMOLD పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ మొబైల్ Qualcomm SM6375 Snapdragon 695 5G (6 nm) ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఈ మొబైల్ 4 కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 108 మెగాపిక్సల్ క్వాలిటీలో ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉంది. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారంగా పని చేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470