50MP కెమెరా, 12GB ర్యామ్ పోకో 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం... ఈ కార్డులతో రూ.2000 డిస్కౌంట్..!
పోకో నుంచి గత వారం పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ తొలి సేల్ ఇవాళ ప్రారంభం అయింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ పోకో స్మార్ట్‌ఫోన్ 90W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుంది. పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ, 12GB+ 512GB అంతర్గత స్టోరేజీని వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో (Poco F6 5G Smartphone sale) ఇవాళ 12PM గంటలకు ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్ బేస్ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. అదే 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999 మరియు 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది. తొలి రోజు కొనుగోలు చేసిన వారు 2 సంవత్సరాలు వారంటీని పొందుతారు.

ఈ సేల్‌లో భాగంగా SBI, ICICI, HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. అదే ఫ్లి్‌ప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా రూ.2500 నుంచి అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లూక్, టైటానియం రంగుల్లో లభిస్తుంది.
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5k రిజల్యూషన్‌తో కూడిన అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. 120Hz రీఫ్రెష్ రేట్ సహా 446ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. మరియు ఆక్టా కోర్ 4nm స్నాప్ డ్రాగన్ 8s జెన్ SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ తెలిపింది.
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS మరియు EIS సపోర్టుతో 50MP 1/1.9 అంగుళాల సోనే IMX882 కెమెరాను అమర్చారు. మరియు 8MP సోనీ IMX355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP OV20B కెమెరాను కలిగి ఉంది.
ఈ పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ Iceloop కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా ఫోన్ ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని సామర్థ్యాన్ని కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో హైబ్రిడ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, వైఫై 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టు సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు యాక్సెలిరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కాంపాస్, గైరోస్కోప్, IR బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో లాంచ్ అయింది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ లాక్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








