256GB స్టోరేజీ, 50MP కెమెరా, 90W ఛార్జింగ్ సపోర్టు 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.6000 తగ్గింపు.. పూర్తి వివరాలు..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటన చేసింది. సేల్ ఆఫర్లతోపాటు బ్యాంకు డిస్కౌంట్‌ల ద్వారా తగ్గింపు ధరకే హ్యాండ్‌సెట్‌లను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా పోకో F6 5G స్మార్ట్‌ఫోన్‌ను (Poco F6 5G Smartphone PriceDrop) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో ప్రారంభ ధర రూ.29,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.6,000 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు HDFC, యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
పోకో F6 స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్ వివరాలు : పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale 2024) 8GB ర్యామ్ వేరియంట్‌ను రూ.23,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా HDFC కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. టైటానియం, బ్లాక్ రంగుల్లో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంది.
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5k (2712*1220 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. దీంతోపాటు HDR+, డాల్బీ విజన్ సపోర్టును కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంటుంది.
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 8s జెన్ SoC చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ OIS, EIS సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరా, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. 35 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ పూర్తిచేయవచ్చని సంస్థ చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా పోకో స్మార్ట్‌ఫోన్ Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, IR సెన్సార్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కాంపాస్, గైరోస్కోప్, IR బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను అమర్చి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








