50MP కెమెరా, 5000mAh బ్యాటరీ సామర్థ్యంలో పోకో నుంచి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
పోకో నుంచి భారత్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ (Poco F6 5G Smartphone) లాంచ్‌ను సంస్థ ధ్రువీకరించింది. మే 23 సాయంత్రం 4:30 గంటలకు లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తామని పోకో సంస్థ తెలిపింది. ఢిల్లీ వేదికగా ఈ విడుదల కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.
ఈ పోకో F6 5G స్మార్ట్‌ఫోన్.. చైనాలో గత నెల విడుదలైన రెడ్‌మి టర్బో 3 హ్యాండ్‌సెట్‌కు (Redmi Turbo # Smartphone) రీ బ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు అందుబాటులో ఉండనుంది.

కొన్ని నివేదికల ప్రకారం పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5k OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుందని తెలుస్తుంది. మరియు క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది.
ఈ పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP సోనీ LYT 600 కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు వెల్లడి కాలేదు. అయితే రెడ్‌మి టర్బో 3 హ్యాండ్‌సెట్ చైనాలో 1999 Yuan కు విడుదల అయింది. భారత కరెన్సీ ప్రకారం రూ.24000 గా ఉంది. అయితే పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.30 వేల నుంచి రూ.35 వేలుగా ఉండే అవకాశం ఉంది.
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ తోపాటు పోకో నుంచి భారత్ మార్కెట్‌లోకి తొలిసారిగా ట్యాబ్లెట్‌ను కూడా లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అయితే దీనిపై పోకో సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ సంవత్సరం మార్చిలో చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి ప్యాడ్ ప్రో.. భారత్‌లో ప్రోకో బ్రాండ్‌తో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఈ వివరాల ఆధారంగా పోకో తొలి ట్యాబ్లెట్ 12.1 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2.5k రిజల్యూషన్‌తో విడుదల కానుందని తెలుస్తోంది. వైఫై వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. దీంతోపాటు 10000mAh బ్యాటరీ సహా 4nm చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








